ప్రస్తుత సమాజంలోనీ ప్రజలు ఏదో ఒక వ్యాధి బారిన పడి ఉంటున్నారు.ఎందుకంటే నేటి సమాజంలో వీరు ఎక్కువగా రసానిక ఎరువులు వాడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు.
శారీర శ్రమ చేసేవారు ఎంత తిన్నా కూడా వారి ఆరోగ్యానికి ఏమీ కాదు.కానీ ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికే శరీరంలో క్యాలరీలు పెరిగిపోవడం జరుగుతుంది.
ఈ రోజుల్లో అందరూ తెల్లగా ఉన్న అన్నాన్ని తినడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు.పోషకాలు ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నం ఎన్నో అనారోగ్యం సమస్యలకు కారణం అవుతుంది.
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అన్నం కనుక ఈ పద్ధతిలో వండుకొని తింటే షుగర్ బీపీ లాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
అన్నాన్ని వండుకునే సమయంలో కొబ్బరి నూనె మూడు శాతం అందులో వేయాలి.
అంటే ఒక కిలో బియ్యానికి 30 గ్రాములకు వేసి అన్నాన్ని వండి అలా వండిన అన్నాన్ని 10 గంటలపాటు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత దాన్ని బయటకు తీసి వెంటనే తినాలి.ఇలాంటి అన్నం తినడం వల్ల క్యాలరీలు రక్తనాళాల్లో కొద్దికొద్దిగా కలుస్తాయి.
దీనివల్ల ఏప్పటి శక్తి అప్పుడే ఖర్చయిపోతుంది.ఈ అన్నం సాధారణంగా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణం అవుతుంది.
దీనివల్ల మన శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది.
ఇలా కొబ్బరి నూనె వేసి వండడం వల్ల మన శరీరంలో కొత్తగా కొవ్వు ఏర్పడకుండా ఉంటుంది.షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ అన్నం ఎంతో మేలు చేస్తుంది.ఇలా అన్నాన్ని వండుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ లో ఉంటుంది.
షుగర్ కూడా అదుపులో ఉంటుంది.మాములు అన్నాన్ని వండుకుని తినడం కంటే ఇలా అన్నంలో కొబ్బరి నూనె వేసి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పట్టడమే కాకుండా భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.