ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సాయి పల్లవి( Sai pallavi ) అయితే తెలుగులో ఈమె ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటన నాట్యంతో ప్రేక్షకులు అందరినీ కూడా ఫిదా చేశారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి చాలా విభిన్నమైన కథ చిత్రాలను అలాగే తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఈమె సై అంటే అడిగినంత రెమ్యూనరేషన్ ( Remuneration )ఇచ్చి సినిమా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నారు కానీ నటనపరంగా తనకంటూ కొన్ని నియమ నిబంధనలను సాయి పల్లవి పెట్టుకున్నారు.రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చినా తాను మాత్రం తన విలువలను పాటిస్తూ హద్దులు దాటనని చెప్పకనే చెప్పేస్తుంటారు.
కథ నచ్చితే చిన్న హీరోతో ఆయన సినిమా చేయటానికి వెనకాడని సాయి పల్లవి కథ నచ్చకపోతే మాత్రం పెద్ద హీరోలకు సైతం నో చెబుతూ ఉంటారు.
ఇలా సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈమె ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా గడుపుతున్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి తన జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.నా చిన్నతనంలో మా కుటుంబంలో మేమే ధనవంతులం అనుకునేదాన్ని, కానీ అప్పుడు మాదగ్గర అంతగా డబ్బు లేదు.
కానీ ఇప్పుడు పేదలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది అంటూ ఈమె మాట్లాడారు.
ఇలా సాయి పల్లవి ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ సుమారు 50 కోట్ల వరకు ఆస్తిపాస్తులను సంపాదించారని తెలుస్తుంది అయితే నా దగ్గర పేదవారికి సహాయం చేసి అంత డబ్బు ఉంది అని చెప్పడంతో ఈమె ఏదైనా ఒక చారిటీ ప్రారంభించబోతున్నారా అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య ( Nagachaitanya )హీరోగా నటిస్తున్న తండేల్ ( Thandel )అనే సినిమాతో బిజీగా ఉన్నారు.