ఈ ప్యాక్ లో తేనేను ఉపయోగించటం వలన జుట్టు తేమగా ఉంటుంది.ఈ ప్యాక్ జుట్టుకి వేసిన తర్వాత మరింత నీటిని గ్రహించి జుట్టు చూడటానికి ప్రకాశవంతంగా మరియు మృదువుగా కనపడుతుంది.
ఆలివ్ నూనె జుట్టు తెగిపోకుండా మరియు పొడిగా మారకుండా సహాయపడుతుంది.మనం నేచురల్ కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు.
ఒకవేళ తాజా కొబ్బరి పాలు దొరక్కపోతే మార్కెట్ లో అమ్మే డబ్బా కొబ్బరి పాలను కూడా ఉపయోగించవచ్చు.కొబ్బరి పాలల్లో ఉండే పోషకాలు జుట్టు తెగిపోకుండా అపుతాయి.
అలాగే జుట్టు తేమగా ఉండేలా చూసే సామర్ధ్యం కలిగి ఉంటుంది.
కావలసినవి
ఆలివ్ నూనె – 2 లేదా 3 స్పూన్స్తేనె – 1 లేదా 2 స్పూన్స్కొబ్బరి పాలు – ఒక కప్పు
పద్దతి
1.ఒక బౌల్ లో కొబ్బరి పాలు, తేనె మరియు ఆలివ్ నూనె వేయాలి.2.ఈ మూడింటిని బాగా కలపాలి.3.ఈ ప్యాక్ ని జుట్టుకు రంగు బ్రష్ సాయంతో పట్టించాలి.4.ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ ని తల మీద చర్మం నుంచి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి.5.రెండు నిముషాలు మసాజ్ చేసి,ఒక అరగంట అలా వదిలేయాలి.6.ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి పలితం కనపడుతుంది.