కరోనా వైరస్ సోకినవారికి గొంతునొప్పి ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమందిని ఈ కరోనా వైరస్ వీధిపాలు చేసింది.

 Throat Pain Corona New Symptoms, Coronavirus, Covid19, Trought Pain, Relif, Trou-TeluguStop.com

అనేకమంది మరణానికి కారణమైంది.ఇకపోతే ప్రస్తుత వాతావరణం బట్టి జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలు మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి.

ఇక కరోనా వైరస్ సంబంధించి మొదటి లక్షణంగా చెప్పుకునే గొంతు నొప్పి కూడా కొన్ని వాతావరణ కారణాల వల్ల కూడా ఈ సమస్య మనకు వస్తుంది.అయితే ఇలా రావడం వల్ల కొంతమంది తమకు కరోనా వైరస్ వచ్చిందేమో అని భయ భ్రాంతులకు లోనవుతుంటారు.

ఇక పోతే ఇలాంటి గొంతు నొప్పి మరికొన్ని కారణాల వల్ల కూడా రావచ్చు.సాధారణంగా గొంతు నొప్పికి ఎలాంటి వాపు కనపడదు.అయితే గొంతు నొప్పి వస్తే చాలా త్వరగా వైద్యుని సంప్రదించి అందుకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.అయితే గొంతు నొప్పి వచ్చిన తర్వాత వారికీ కరోనా వైరస్ సోకిందా లేదా అన్న విషయం కోసం కొన్ని సూచనలు ఉన్నాయి.

అవి ఏమిటో ఓసారి చూద్దాం… కరోనా వైరస్ వల్ల వచ్చే గొంతు నొప్పికి తీవ్రమైన గొంతు మంట అలాగే గొంతు వాపు లాంటివి ఖచ్చితంగా కనిపిస్తాయి.మీరు ఎలాంటి హాని కలగని వాతావరణంలో ఉన్న కూడా తీవ్రమైన జ్వరం, గొంతులో మంట, జలుబు ఇలాంటి సమస్యలు ఉంటే అది ఖచ్చితంగా కరోనా వచ్చినట్లు అని భావించవచ్చు.


అలా కాకుండా కేవలం జ్వరం, దగ్గు లేదా గొంతునొప్పి మామూలుగా ఉంటే అది కరోనా వైరస్ అని భయపడాల్సిన అవసరం లేదు.ఒకవేళ మీకు ఆ అనుమానం ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది.

ఇకపోతే ఇలా గొంతు నొప్పి ఉన్నప్పుడు కచ్చితంగా చల్లని నీటిని, శీతల పానీయాలను అస్సలు తీసుకోకూడదు.కేవలం వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి.ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఒకవేళ కరోనా శరీరంలో ఉన్న కానీ, దాని నుండి బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.వీటితో పాటు గొంతు నొప్పి, గొంతువాపు, అలాగే దగ్గు, జలుబు లాంటివి తగ్గేందుకు నీటిలో కాస్త పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే ఎంతగానో రిలీఫ్ దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube