మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప(Kannappa) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే.
ఇలా వివిధ భాష సెలబ్రిటీలు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.ఇలా ఈ సినిమా గురించి వస్తున్న విమర్శలపై మంచు విష్ణు కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు.ఇలా ఇప్పటికే ట్రోలర్స్ కు తనదైన స్టైల్ లోనే మంచు విష్ణు సమాధానం చెప్పారు.
మరో నటుడు కన్నప్ప సినిమా గురించి వస్తున్న ట్రోల్స్ (Trolls)గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నటుడు రఘుబాబు(Raghu Babu) మాట్లాడుతూ కన్నప్ప సినిమా గురించి ఎవరైనా విమర్శలు చేస్తే తప్పకుండా శివుడి ఆగ్రహానికి, శాపానికి గురి కావలసి ఉంటుందని తెలిపారు.గుర్తు పెట్టుకోండి.ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది.ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్ అంటూ రఘు బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఇక ఈయన వ్యాఖ్యలపై నేటిజన్స్ విభిన్నంగా స్పందిస్తూ ఉన్నారు.
సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా సినిమా విజయాన్ని ఎవరు ఆపలేరు కానీ ఇలా శాపాలు కలుగుతాయి అంటూ వింత కామెంట్లు చేయటం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.