ఆస్ట్రేలియాలో బంపరాఫర్.. అపార్ట్‌మెంట్ కొంటే పోర్షే కార్ ఫ్రీ!

సిడ్నీలోని బారంగరూ ఏరియాలో ‘వన్ సిడ్నీ హార్బర్’( One Sydney Harbour ) అపార్ట్‌మెంట్లలో ఉండే వాళ్లకు ఇప్పుడు ఓ శుభవార్త అందింది.ఇప్పటికే అద్భుతమైన వాటర్ ఫ్రంట్ వ్యూస్, సూపర్ లగ్జరీ సౌకర్యాలతో డ్రీమ్ హోమ్( Dream House ) దొరికిందని వాళ్లు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

 Free Porsches Offered To Sydney Apartment Owners Viral Details, Free Porsches ,-TeluguStop.com

అయితే, ఇప్పుడు వాళ్లకు మరో ఊహించని సర్‌ప్రైజ్ కూడా తోడైంది.అదేంటంటే.

సరికొత్త పోర్షే ఎలక్ట్రిక్ కార్లు వారికి ఫ్రీగా అందుబాటులో ఉంటాయి.

ఈ ‘వన్ సిడ్నీ హార్బర్’ అంటే ఏంటంటే ఇది మూడు ఆకాశహర్మ్యాలతో కూడిన ఒక భారీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్.

దీన్ని ప్రిట్జ్‌కర్ ప్రైజ్ గెలుచుకున్న ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ రెంజో పియానో డిజైన్ చేశారు.సిడ్నీలోనే ఇది చాలా పేరున్న, కాస్ట్లీ అడ్రస్‌లలో ఒకటిగా నిలిచింది.ఎంతలా అంటే, ఈ ప్రాజెక్టులోని 95% అపార్ట్‌మెంట్లు ఇప్పటికే సేల్ అయిపోయాయి.మొత్తం అమ్మకాల విలువ ఏకంగా 4 బిలియన్ డాలర్లను దాటేసింది.

ఇక మిగిలిన కొన్ని ఫ్లాట్ల ధరలు కూడా కళ్లు చెదిరేలా ఉన్నాయి.

Telugu Australia, Porsches, Luxury Houses, Ony Sydney, Outbound, Porscheelectric

వన్-బెడ్‌రూమ్ కొనాలంటే కనీసం 1.68 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14 కోట్లు), టూ-బెడ్‌రూమ్ కోసం 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.25 కోట్లు), త్రీ-బెడ్‌రూమ్ 5.3 మిలియన్ డాలర్లు (సుమారు 44 కోట్లు) పెట్టాల్సిందే.

ఇంత ఖరీదైన ఇళ్లల్లో ఉంటున్నారంటే సౌకర్యాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి.వీరికి 24 గంటల కాన్సియర్జ్ సర్వీస్ (సహాయక సేవలు), అనేక స్విమ్మింగ్ పూల్స్, ఒక ప్రైవేట్ వైన్ గ్యాలరీ, అత్యాధునిక వెల్‌నెస్ సెంటర్లు వంటి ఫైవ్-స్టార్ సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి.

ఇప్పుడు, వీటన్నింటితో పాటు, వారి లైఫ్‌స్టైల్ బెనిఫిట్స్‌లో భాగంగా పోర్షే ఎలక్ట్రిక్ కార్లను( Porsche Electric Cars ) వాడుకునే అవకాశం కూడా వచ్చి చేరింది.

Telugu Australia, Porsches, Luxury Houses, Ony Sydney, Outbound, Porscheelectric

ఈ ప్రాపర్టీ డెవలపర్ అయిన ‘లెండ్‌లీజ్’ సంస్థ, ఈ మధ్యనే ‘అవుట్‌బౌండ్’( Outbound ) అనే కంపెనీతో చేతులు కలిపింది.దీని ద్వారా, పోర్షే కంపెనీకి చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ కార్ల ఫ్లీట్‌ను ప్రత్యేకంగా ఈ బిల్డింగ్ నివాసితుల కోసం అందుబాటులోకి తెచ్చారు.అంటే, సుమారు 145,000 డాలర్లు (రూ.1.2 కోట్లు) విలువ చేసే పోర్షే మాకాన్ EV లేదా 194,000 డాలర్లు (రూ.1.6 కోట్లు) విలువ చేసే టేకాన్ EVని కొనాల్సిన పని లేకుండా, ఇక్కడి నివాసితులు చాలా తక్కువ ధరకే ఈ లగ్జరీ కార్లను అద్దెకు తీసుకోవచ్చు.ఓనర్‌షిప్, మెయింటెనెన్స్ వంటి తలనొప్పులు లేకుండా ప్రీమియం కార్లను ఎంజాయ్ చేయడానికి ఇదొక అద్భుతమైన, సులువైన మార్గం.

ఇప్పటికే రికార్డు స్థాయి ధరలతో పేరుగాంచిన ఈ ప్రాపర్టీ, 2019లో ఒక సంచలనం సృష్టించింది.ఇక్కడి మూడు అంతస్తుల పెంట్‌హౌస్ ఏకంగా 140 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.1160 కోట్లు) అమ్ముడైంది.ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఇల్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube