గుల్కండ్.సమ్మర్‌లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన రెసిపీలలో ఇది ఒకటి.గులాబీ రేకులు, చక్కెరతో గుల్కండ్‌ను తయారు చేస్తారు.ఈ రెసిపీ సూపర్ టేస్ట్‌ను కలిగి ఉండటమే కాదు.బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం గుల్కండ్‌ను తీసుకోవడం వల్ల ఏయే ఆరోగ్య లాభాలను పొందొచ్చో తెలుసుకుందాం పదండీ.
ప్రస్తుతం వేసవి కాలం స్టార్ట్ అయింది.ఎండలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి.అయితే చాలా మంది వేసవి వేడిని తట్టులేక ఆగమాగం అయిపోతుంటారు.అయితే గుల్కండ్ వేడిని తగ్గించి శరీరాన్ని కూల్‌గా మార్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకే ప్రతి రోజు ఒక స్పూన్ గుల్కండ్ తీసుకుంటే వేసవి వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు.
అలాగే సమ్మర్‌లో మండే ఎండల కారణంగా కొందరికి ముక్క నుండి రక్తం వస్తుంటుంది.
ఈ సమస్యకు చెక్ పెట్టడంలో గుల్కండ్ సహాయపడుతుంది.రోజూ గుల్కండ్ తీసుకుంటే ముక్క నుండి రక్తం కారడం తగ్గుతుంది.
సన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారు.నీరసం, అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం, అధిక ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి.

నిద్ర లేమితో సతమతం అవుతున్న వారు.రెగ్యులర్‌గా పడుకోవడానికి గంట ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలలో వన్ టేబుల్ స్పూన్ గుల్కండ్ కలిపి సేవించాలి.ఇలా చేస్తే హాయిగా నిద్ర పోవచ్చు.అంతే కాదండోయ్.గుల్కండ్‌ను డైట్‌లో చేర్చుకుంటే రక్త హీనత క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.చర్మం మునుపటి కంటే ఎక్కువ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.
మొటిమలు రకుండా ఉంటాయి.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.మరియు నెలసరి సమయంలో వేధించే అధిక రక్తస్రావం సమస్య నుంచి సైతం విముక్తి పొందొచ్చు.