కంప్యూటర్ ముందు కూర్చుని జాబ్ చేస్తున్నారా? అయితే క్రమం తప్పకుండా ఇలా చేయాల్సిందే..!

ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న చాలా మంది ప్రజలలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) ఉన్నాయి.

ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు శ్రమ లేని ఉద్యోగాలను ఎక్కువగా చేస్తూ ఉన్నారు.

దానితో పాటు అంతర్గత అవయవాలకు పని లేకుండా పోయింది.అలాగే మారిన జీవన శైలి, చెడు అలవాట్లు, జంక్ ఫుడ్ వల్ల కూడా చాలా మంది ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇంకా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో ఏ ఇంట్లో చూసినా ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడే వారు ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అందువల్ల రోజు కనీసం 45 నిమిషాల పాటు నడవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయని చెబుతున్నారు.మరి ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసే వారు రెగ్యులర్ గా వాకింగ్ ( walking )చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

ఇలాంటి నడక వల్ల ఆరోగ్యకరమైన బరువుతో పాటు శరీర కొవ్వును తగ్గించుకోవచ్చు.అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే టైప్ టు డయాబెటిస్ తో సహా వివిధ అనారోగ్యాలు దరిచేరకుండా నివారించవచ్చు.

అలాగే గుండె సంబంధిత సమస్యలను దూరం చేసుకోవడానికి నడక చక్కని మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఎముకలు, కండరాలు బలోపేతం కావాలంటే ప్రతి రోజు నడవాల్సిందే అని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే రోగనిరోధక శక్తి ( Immunity )కూడా మెరుగుపడుతుంది.

దీని వల్ల సీజనల్ వ్యాధుల( Seasonal diseases ) నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల అధిక బరువు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు