ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా కొంతమంది ముద్దుగుమ్మలకు మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.ఇక హీరోయిన్ల అభిమానులు ఎప్పుడు సోషల్ మీడియా లో మా హీరోయిన్ గొప్ప అంటే మా హీరోయింకా గొప్ప అంటూ ఎప్పుడూ హల్చల్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
ఇక ఇలా ఒక్కసారి అభిమానించడం మొదలు పెట్టారంటే చాలు సినిమాలు తీసిన తీయకపోయినా.వయసు మీద పడినా కూడా వాళ్లనే ఆరాధించడం చేస్తూ ఉంటారూ.
ఇక ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి హీరోయిన్ల కంటే భిన్నంగా కాస్త ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు.
ఆ ఇద్దరూ ఎవరో కాదు సమంత, కాజల్ అగర్వాల్.
అయితే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్.తక్కువ సమయంలోనే మగధీర లాంటి సినిమాలో ఛాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక అప్పటి నుంచి టాప్ హీరోలందరితో కలిసి నటించడం మొదలు పెట్టింది.ఇక ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి.తర్వాత ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.ఎవరు ఈ అమ్మడిలా క్రేజ్ మాత్రం సంపాదించుకోలేక పోయారు.
కాజల్ అగర్వాల్ కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఒకే రకమైన పాత్రలు మాత్రమే చేసింది చాలెంజింగ్ పాత్రల జోలికి వెళ్లి రిస్క్ చేయలేదు.కానీ సమంత విషయానికి వస్తే ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరినీ తన మాయలో పడేసింది.ఆ తర్వాత అవకాశాలు ఈ అమ్మడి తలుపు తట్టి.బ్లాక్బస్టర్ హిట్లు ఈ అమ్మడి ఖాతాలో చేరిపోయాయి.ఇలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడం మొదలు పెట్టింది. ఓ బేబీ సహా మరికొన్ని సినిమాల్లో పాత్రలు సమంత తప్ప ఇంకెవరూ చేయలేరు ఏమో అనేంతగా తన నటనతో మెప్పించింది సమంత.
ఇలా అందం విషయంలో ఇద్దరూ సమానం గానే ఉన్నా అటు ఛాలెంజింగ్ రోల్స్ విషయంలో నటన పరంగా మాత్రం సమంతా కాజల్ కంటే ఒక మెట్టు పైనే ఉంది అని చెప్పాలి.