అందంగా మెరిసిపోతూ కనిపించాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.స్త్రీలే కాదు పురుషులు కూడా అదే కోరుకుంటారు.
కానీ మొటిమలు, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇలా ఏదో ఒక చర్మ సమస్య కారణంగా అందం దెబ్బ తింటుంది.దాంతో ఆయా చర్మ సమస్యలు నివారించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల చర్మ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే ఫేషియల్ క్యూబ్స్ మాత్రం మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి ఎన్నో చర్మ సమస్యలను మాయం చేసి క్లియర్ అండ్ గ్లోయింగ్‌గా స్కిన్‌ను అందిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేషియల్ క్యూబ్స్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేయాలి.అలాగే ఒక కీర దోసకాయను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు వేపాకులు, కట్ చేసి పెట్టుకున్న కీరా స్లైసెస్, అలోవెరా జెల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ ను ఐస్ ట్రేలో వేసి నాలుగైదు గంటల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఫేషియల్ క్యూబ్స్ తయారైనట్టే.ఈ క్యూబ్స్‌ను ముఖానికి స్మూత్ గా రబ్ చేసుకుని.పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు గనుక చేస్తే మొటిమలు, మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.మరియు ముఖ చర్మం గ్లోయింగ్‌గా, ఎట్రాక్టివ్‌గా మెరుస్తుంది.