ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి.
అయితే తమిళనాడులో రోజురోజుకు శరవేగంగా విజృంభిస్తున్న మహమ్మారి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అక్కడి ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారులు పరిశోధకులు సూచనలు సలహాలు చేస్తూనే ఉన్నారు.

అయితే నీటిలో ఉప్పు పసుపు కలిపి రోజుకు ఐదు సార్లు పుక్కిలిస్తే ప్రాథమిక స్థాయిలోనే ప్రపంచ మహమ్మారి కరోనా ను నివారించవచ్చు అంటూ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్, అఖిలభారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సిఎంకె రెడ్డి వెల్లడించారు.కరోనా నుంచి తప్పించుకునేందుకు సీఎంకే రెడ్డి పలు సూచనలు చేశారు.ముఖ్యంగా 12 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్దులు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

ప్రజలందరూ అల్లం,వెల్లుల్లి, మిరియాలు, సొంటి, జీలకర్ర ధనియాలు, లవంగాలు, ఆవాలు తదితర వాటిని ఎక్కువ మోతాదులో వినియోగిస్తే… ఈ వైరస్ నుంచి ప్రాథమికంగా ఉపశమనం లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ డాక్టర్ సిఎంకె రెడ్డి.
.