సాధారణంగా మనిషి ప్రమేయం లేకుండా మనిషి జీవితంలో జరిగేవి రెండే రెండు.ఒకటి మనిషి పుట్టుక, మరొకటి మరణం.
ఈ రెండు మనిషి ప్రమేయం లేకుండా జరుగుతాయి.ఈ క్రమంలోనే కొందరు మన ఆయుష్షు తీరకుండా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.
ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారి ఆయుష్షు ఉన్నంతవరకు వారి ఆత్మ తిరుగుతూ ఉంటుందని వారి ఆయుష్షు తీరిన తర్వాత వారి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుందని చెబుతుంటారు.అయితే మనకి మరణం సంభవిస్తుందన్న సమయంలోనే ముందుగా మనకు కొన్ని సంకేతాలు అందుతాయని పండితులు తెలియజేస్తున్నారు.
మరణం మనకు సంభవిస్తున్న సమయంలో మనకు ఎలాంటి సూచనలు కనబడతాయి? ఏ విధమైనటువంటి సంకేతాలు అందుతాయి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం… సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో మనల్ని యమకింకరులు తీసుకు వెళ్తున్నట్టు కలలు వస్తాయి.అలా కలలో యమకింకరులు కనబడితే మనకు మరణం త్వరగా వస్తుందని అర్థం.
అలాగే కొందరికీ గోడలపై యమకింకరులు మాదిరి వారి ఆకారం కనిపించడం జరుగుతుంది.ఇలా వారి కంటికి కనిపించినప్పుడే వారు మాకు సమయం దగ్గరపడింది మేము చనిపోతాం అంటూ స్వయంగా వారి నోటిగుండా వారు చెబుతుంటారు.
![Telugu Dreams, Letters Bee, Yamadharma Raj, Yamakinkarulu, Yamaraja, Yamaraja Dr Telugu Dreams, Letters Bee, Yamadharma Raj, Yamakinkarulu, Yamaraja, Yamaraja Dr](https://telugustop.com/wp-content/uploads/2021/10/yamraj-sends-four-letters-of-death-to-every-mortal-yet-no-one-yet-no-one-realizesa.jpg)
అదేవిధంగా వారు ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నప్పుడు వారిని పిలిచి వారితో మాట్లాడటం జరుగుతుంది అలాంటివన్నీ మనసులో పెట్టుకోకూడదు ఈ రోజు ఉండి రేపు పోయేవాళ్ళం సరదాగా ఉందాం అంటూ మాట్లాడుతుంటారు.అదేవిధంగా నాకు కాలం చేసే సమయం అయిందని భావిస్తూ దూరంగా ఉన్న వారి బంధు మిత్రులను కూడా రప్పించుకొని చూస్తుంటారు.అయితే ఇలా మనతో మాట్లాడించడం అన్నీ కూడా మనం చనిపోతున్నామని చెప్పడానికి సంకేతం అని పండితులు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU