ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్య క్షేత్రానికి మన దేశంలో నుంచి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తూ ఉంటారు.చాలా మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.
మరి కొంత మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు.కొంత మంది భక్తులు మాత్రమే స్వామి వారికి హుండీలో కానుకలను సమర్పిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.స్వామి వారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్( Vaikuntham Q Complex ) లో 19 కంపార్ట్మెంట్లలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam )అధికారులు వెల్లడించారు.
ఇంకా చెప్పాలంటే టోకెన్లు లేని భక్తులకు దాదాపు 15 గంటల సమయం స్వామి వారి దర్శనానికి పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.గురువారం రోజు స్వామి వారిని దాదాపు 63,535 మంది భక్తులు దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే 24,349 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు.శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ 3.96 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్ర కు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్( Sunita Lakhan Kumar Aggarwal ) గురువారం ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ.11 లక్షల రూపాయలను విరాళంగా అందించినట్లు సమాచారం.ఎస్వీబీసీ కార్యాలయంలో చైర్మన్ కుమార్ కు దాత ప్రతినిధులు రాఘవేంద్ర, బాల సుదర్శన్ రెడ్డి ఈ మేరకు డిడిని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులకు అందజేశారు.