ఇంట్లో మెయిన్ స్విచ్ ఏర్పాటుకు వాస్తు నియమాలు ఉన్నాయి తెలుసా..?

వాస్తు శాస్త్రంలో( Vastu Shastra ) ఇంటి నిర్మాణం, ఇంట్లోనీ వస్తువుల ఏర్పాటుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు ప్రకారం అమర్చితే ఇంట్లో శ్రేయస్సు ఏర్పడుతుంది.

 Do You Know The Vastu Rules For Setting Up The Main Switch In The House , Vast-TeluguStop.com

ఇంట్లో విద్యుత్ ని అందించేందుకు మెయిన్ స్విచ్ ( Main switch )ను కూడా ఏర్పాటు చేస్తారు.అటువంటి పరిస్థితిలో వాస్తు ప్రకారం మెయిన్ స్విచ్ ఇన్ స్టాల్ చేయడం ఎంతో ముఖ్యం.

వాస్తు ప్రకారం మెయిన్ స్విచ్ ఏర్పాటు చేయకుండా నచ్చిన చోట పెట్టుకోవడం వల్ల ఇంట్లోనే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి వాస్తు ప్రకారం మెయిన్ స్విచ్ ఏర్పాటు చేసుకుంటే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Telugu Switch Meter, Switch, Problems, Scholars, Southeast, Vastu Shastra-Telugu

చాలామందికి విద్యుత్ మెయిన్ స్విచ్ మీటర్( Electricity main switch meter ) గురించి ఏర్పాటు చేసుకోవడం విషయంలో గందరగోళం ఉంటుంది.మీటర్ ను మెయిన్ స్విచ్ పరిగణించి అక్కడ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది అని చాలామంది భావిస్తారు.అయితే మీటర్ మెయిన్ స్విచ్ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం.మీటర్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.ఎందుకంటే ఇది ఒక నిర్దిష్ట స్థలంలో మాత్రమే ప్రభుత్వ అధికారులు ఏర్పరుస్తారు.ఈ మీటర్ మీరు వినియోగించే విద్యుత్ మాత్రమే ట్రాక్ చేస్తుంది.

మీటర్ నుంచి విద్యుత్ నేరుగా మెయిన్స్ స్విచ్ కి వెళ్లి అక్కడి నుంచి పంపిణీ చేయబడుతుంది.

Telugu Switch Meter, Switch, Problems, Scholars, Southeast, Vastu Shastra-Telugu

ఇంకా చెప్పాలంటే మెయిన్ స్విచ్( Main switch ) అనేది అగ్ని మూలకూ చిహ్నంగా భావిస్తారు.మెయిన్ స్విచ్ కూడా వాస్తు నియమాలకు లోబడి సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి.ఈ మెయిన్ స్విచ్ నైరుతిలో ఉన్నట్లయితే రాహు, కుజుడు సంయోగంతో అంగారక యోగం ఏర్పడుతుంది.

అప్పుడు ఆ ఇంటి యజమాని ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.అదే సమయంలో మెయిన్ స్విచ్ ఈశాన్య ములలో పెడితే భవన యజమాని మెదడు విద్యుదాఘాతానికి గురవుతుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.

ఈశాన్య దిశలో నీరు ఉంటుంది.కాబట్టి నీటికి విద్యుత్తు కు ఉండే బంధం అందరికీ తెలిసిందే.

కాబట్టి మెయిన్ స్విచ్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రదేశం ఆగ్నేయ ( Southeast )మూల అంటే తూర్పు, దక్షిణ దిక్కుల మధ్య ఏర్పాటు చేయడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube