తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారం.. ముక్కోటి వైభోగం ఎలా జరుగుతుందంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ప్రతి రోజు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి శ్రీవారికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.2023 నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1, రెండవ తేదీలలో తిరుమల శ్రీవారి దేవాలయంలో భక్తుల రద్దీ భారీగా ఉంది.తిరుమల శ్రీవారి దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనం  మొదలవడం కూడా దీనికి ఒక కారణం.శ్రీవారికి నిర్వహించే పుణ్య కార్యాలన్నీ పూర్తయిన తర్వాత అర్ధరాత్రి 12.5 నిమిషముల నుంచి ఉత్తర ద్వార దర్శనాలు అర్చకులు మొదలుపెట్టారు.ముందుగా వివిధ హోదాల్లో ప్రముఖులకు ద్వారా దర్శన అవకాశం కల్పించి, ఆ తర్వాత వీఐపీల దర్శనం పూర్తయిన తర్వాత, ప్రస్తుతం సాధారణ భక్తుల దర్శనాలు కొనసాగుతూ ఉన్నాయి.

 The Vaikuntha Gate Opened In Tirumala..how Does The Happen Mukkoti Ekadasi , M-TeluguStop.com

శ్రీవారి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనం కోసం అనుమతిస్తున్నారు.ఈ నెల 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగే అవకాశం ఉంది.అంతే కాకుండా సర్వదర్శనం టోకెన్లు జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.ముక్కోటి ఏకాదశి కావడంతో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే టికెట్లు కూడా పొంది ఉన్నారు.ఆన్లైన్లో రూ.300 ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టికెట్లు కూడా జారీ చేస్తున్నారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండను విద్యుత్ పుష్పాలంకరణతో అలంకరించారు.

Telugu Andhra Pradesh, Devotional, Mukkoti Ekadasi, Tickets, Tirumala-Latest New

తిరుపతి విమానాశ్రయానికి ప్రముఖుల విమానాలు వరుసగా వచ్చి చేరుతున్నాయి.స్వామివారిని దర్శించాలన్న తపనతో దూరప్రాంతాలకు చెందిన దీక్ష స్వాములు ఆదివారం రాత్రికి దేవాలయానికి చేరుకున్నారు.దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములంతా దర్శన తర్వాత ఇరుముడులను సమర్పించే అవకాశం ఉంది.ఉదయం స్వామి వారి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా జరిగింది.

వేలాది మంది భక్తులు గోవిందా దీక్షాధారణల గిరి ప్రదర్శనలతో శేషాచల పరిసరాలు స్తంభించిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube