జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి( Shanidev ) ప్రత్యేక స్థానం ఉంది.దీన్ని నవగ్రహాలలో క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు.
శని రాసి చక్రం మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.నెమ్మదిగా కదిలే గ్రహాలలో శని గ్రహం ఒకటి అని చాలామందికి తెలుసు.
అందుకే మొత్తం 12 రాసి చక్రాలు సంచరించేందుకు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది.గత సంవత్సరం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో( Aquarius ) ప్రవేశించాడు.ఈ సంవత్సరం మొత్తం ఇదే రాశిలో సంచరిస్తాడు.2025 మార్చి 29వ తేదీన మీన రాశిలోకి( Pisces ) ప్రవేశం చేస్తాడు.ప్రస్తుతం శని గత్వ దశలో ఉన్నాడు.మార్చి నెలలో శని ఉదయించబోతున్నాడు.మార్చి నుంచి డిసెంబర్ వరకు కుంభ రాశిలో సంచరించనున్న
శని చూపు కొన్ని రాశుల మీద పడుతుంది.కుంభరాశిలో శని ఉండడం వల్ల ప్రభావం కుంభం, మకరం, మీనా రాశిపై ఉంటుంది.అదే సమయంలో వృశ్చికం, కర్కాటక రాశి, వారిపై శని దయ ప్రభావం కనిపిస్తుంది.శని సంచారంలో వృత్తి, ఆర్థిక, ప్రేమ, జీవితంలో ఇబ్బందులకు దారితీస్తుంది.శని వక్ర దృష్టి పడకుండా ఉండడం కోసం జ్యోతిష్య శాస్త్రం( Jyotishya Shastram ) ప్రకారం కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శని దేవుడి చెడు ప్రభావాన్ని దూరం చేసుకోవచ్చు.మరి ఆ పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలినాటి శని ప్రభావాలు తగ్గించుకోవడం కోసం శనివారం రోజు నల్ల నువ్వులు, నల్ల రంగు వస్తువులు దానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నలుపు రంగు( Black Color ) శనికి ఎంతో ఇష్టమని దాదాపు చాలామంది ప్రజలకు తెలుసు.ప్రతి శనివారం హనుమంతుడిని( Hanuman ) పూజించాలి.ఎందుకంటే దేవుళ్ళలో శని ప్రభావం పడని వారిలో ఆంజనేయ స్వామి ఒకరు.
ఆయన అనుగ్రహం ఉంటే శని చెడు ప్రభావం దూరమైపోతుంది.శివుడిని ఆరాధించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గించుకోవచ్చు.
ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు.నల్ల మినప్పప్పు, ఆవనూనె, నలుపు రంగు వస్త్రాలు దానం చేయడం ఎంతో శుభంగా భావిస్తారు.
DEVOTIONAL