న్యూమరాలజీ( Numerology ) అనేది నిర్ణీత సంఖ్యల ఆధారంగా వ్యక్తుల గుణాలను, లక్షణాలను విశ్లేషించే శాస్త్రం అని చాలామందికి తెలుసు.పుట్టినరోజు ఆధారంగా సంఖ్య శాస్త్ర నిపుణులు ( Numerology experts )వ్యక్తులకు వర్తించే సంఖ్యలను, వాటి ప్రభావాలను అంచనా వేస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ఈ శాస్త్రంలో కొన్ని సంఖ్యలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు.అవి ఏంటి ఆ సంఖ్యలు వర్తించే వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూమరాలజీలో 11, 22, 33 వంటి మాస్టర్ అంకెలను అత్యంత శక్తివంతమైన సంఖ్యలుగా పరిగణిస్తారు.వీటిని ఇతర సంఖ్యల కంటే శక్తివంతమైన గా చెప్తారు.
ఎందుకంటే ఇవి తెలివి, అవగాహనను సూచిస్తాయి.ఈ సంఖ్యలను ఒకే అంకెకు రెడ్యూస్ చేయరు.
ఎందుకంటే ఇవి రెండంకెల రూపంలో మరింత శక్తివంతమైనవిగా న్యూమరాలజీ చెబుతోంది.

ముఖ్యంగా చెప్పాలంటే నంబర్ 33 అనేది ఇతరులకు కరుణ, వైద్యం, సేవను( Compassion, healing, service ) సూచించే మాస్టర్ సంఖ్య.న్యూమరాలజీ ప్రకారం నంబర్ 33 ప్రభావం ఉన్న వ్యక్తులు దయగలవారు.ఇతరులకు సాయం చేయాలని బలమైన కోరిక వీరిలో ఎప్పుడు ఉంటుంది.
వైద్య వృత్తిలో ఉండేందుకు వీరు ఇష్టపడతారు.ప్రపంచాన్ని బెటర్ ప్లేస్ గా మార్చడానికి అంకితమైన టీచర్లు గా వీరు గుర్తింపు పొందుతారు.
నంబర్ 22 అనేది ఈ పాండిత్యం, శక్తి సుగుణాలను సూచించే మాస్టర్ సంఖ్య.న్యూమరాలజీ ప్రకారం నంబర్ 22 వర్తించే వ్యక్తులు నేచురల్ లీడర్స్( Natural leaders ) గా ఉంటారు.
నిజ జీవితంలో లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం వీరికి ఎప్పుడూ ఉంటుంది.మీరు చాలా తెలివైన వారు అలాగే బలమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటారు.

ఇంకా చెప్పాలంటే నంబర్ 11 అనేది అంతర్ దృష్టి, ప్రేరణ జ్ఞానోదయాన్ని సూచించే మాస్టర్ సంఖ్య.న్యూమరాలజీ ప్రకారం 11వ సంఖ్య ఉన్న వ్యక్తులు చాలా సహజంగా ఉంటారు.ఆధ్యాత్మికంగా బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు.సృజనాత్మకంగా ఉండే దూరదృష్టి గల నాయకులుగా గుర్తింపు పొందుతారు.ఇంకా చెప్పాలంటే న్యూమరాలజీ ప్రకారం మాస్టర్స్ నెంబర్స్ ఉన్న వ్యక్తులు ఇతర సంఖ్యలు వర్తించే వ్యక్తుల కంటే ఎక్కువ ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతూ ఉంటారు.