ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.49
సూర్యాస్తమయం: సాయంత్రం.6.13
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.5.48 ల6.22 సా6.58 ల7.22
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:

ఈరోజు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన వాహన యోగం ఉన్నది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అధికారులతో చర్చలు ఫలిస్తాయి.వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
వృషభం:

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మిథునం:

ఈరోజు అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం:

ఈరోజు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
సింహం:

ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు.బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది.భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.
కన్య:

ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి.వ్యాపార మందకొడిగా సాగుతాయి.
తుల:

ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి.ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి.
ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.
వృశ్చికం:

ఈరోజు ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.స్ధిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆర్థికంగా సమస్యలు తప్పవు.కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు.ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.
ధనుస్సు:

ఈరోజు వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది.చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
మకరం:

ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి.ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు.
కుంభం:

ఈరోజు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన వాహన యోగం ఉన్నది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అధికారులతో చర్చలు ఫలిస్తాయి.వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
మీనం:

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.శారీరక మానసిక సమస్యలు భాదిస్తాయి.ఉద్యోగమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసి రావు.కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.