మగవారి ఏ శరీర భాగాలపై.. బల్లి పడితే శుభం జరుగుతుందో తెలుసా..?

Do You Know Which Parts Of A Man's Body Are Lucky If A Lizard Falls On Them , Lizard Science, Vastu , Vastu Tips, Money Gain , Puranas

హిందూ సాంప్రదాయంలో పురాణ గ్రంథాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇందులో బల్లి శాస్త్రం( Lizard science ) కూడా కొన్ని అర్థాలను చెబుతూ ఉంటుంది.

 Do You Know Which Parts Of A Man's Body Are Lucky If A Lizard Falls On Them , Li-TeluguStop.com

బల్లి మనిషి మీద ఎక్కడపడితే వాటి వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అందులో ఉంటుంది.అందులోనే పురుషులకు అయితే ఒకలా స్త్రీలకు అయితే ఇంకోలా ఉంటుంది.

బల్లి పురుషుల పై ఎక్కడ పడితే దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి.పురుషుల మీద బల్లి పడినప్పుడు కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషుల తల మీద బల్లి పడితే ఎదుటి వారితో గొడవలు అవుతాయని అలాగే మృత్యు భయాలు వెంటాడుతాయని బల్లి శాస్త్రం చెబుతోంది.అంతే కాకుండా నుదుటి మీద బల్లి పడితే దూరంగా ఉండే బంధువుల నుంచి కీడు వార్తలు వినే అవకాశం ఉంటుంది.

ఒకవేళ బల్లి కనుక పురుషుల ముఖం మీద పడినట్లు అయితే ఆకస్మిక ధన లాభం ( Money gain ) కలుగుతుందని బల్లి శాస్త్రంలో ఉంది.

అదే విధంగా బల్లి కుడి కన్నుపై పడితే అపజయాలు ఎదురవుతాయి.ఎడమ కన్ను పై బల్లి పడితే శుభం జరుగుతుంది.అంతేకాకుండా ముక్కు మీద బల్లి పడితే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

అదే విధంగా మెడ మీద బల్లి పడితే మగ సంతానం కలుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే కంఠం మీద బల్లి పడితే శత్రు భయం వేటాడుతుందని చెబుతూ ఉంటారు.

అంతే కాకుండా మగవారి పొట్ట పై బల్లి పడితే త్వరలో వారికి సంతానం కలుగుతుందని అర్థం చేసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే బల్లి మీద పడిన వెంటనే తలస్నానం చేసి ఇష్ట దైవానికి దీపారాధన చేసి, రాళ్ల ఉప్పును నైవేద్యం గా సమర్పించి చెడు జరగకూడదు అని ప్రార్థిస్తే దోషం దూరమైపోతుంది అని పండితులు చెబుతున్నారు.

Do You Know Which Parts Of A Man's Body Are Lucky If A Lizard Falls On Them , Lizard Science, Vastu , Vastu Tips, Money Gain , Puranas - Telugu Lizard Science, Puranas, Vastu, Vastu Tips #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube