సనాతన సంప్రదాయాలలోనూ, ఆయుర్వేద వైద్యంలోనూ తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.మన దేశ వ్యాప్తంగా చాలా మంది ఇళ్లలో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది.
కానీ తులసి మొక్కను ఇంట్లో పెట్టుకునే వారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.పరమ పవిత్రమైనదిగా భావించే తులసి కోట దాదాపు అన్ని ఇళ్లలో ఉంది.
తులసి మొక్క ఎండిపోయినప్పుడు ఏం చేయాలో చాలామందికి సరైన అవగాహన లేదు.
సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇల్లు అసంపూర్ణమని చెబుతూ ఉంటారు.
ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసి కోట కట్టించి అందులో నాటుతారు.తులసి కోటకు నలువైపులా దేవత చిత్రాలు ఉంచి, నాలుగు వైపులా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గుళ్లను ఏర్పాటు చేస్తారు.
కొన్ని ఇళ్లలో వరండాలో ఒక డజను దాకా తులసి మొక్కలు పెంచుతూ ఉంటారు.ఒక చిన్న పార్టీ పొదలాగా పెరిగిన దీన్ని తులసి వనం లేదా తులసి దళం అని కూడా పిలుస్తూ ఉంటారు.

కొన్నిసార్లు వాతావరణ ప్రభావం వల్ల తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది.ఇంట్లో ఎండిపోయిన మొక్క ఉంటే అశుభంగా భావిస్తారు.ఎండిపోయిన తులసి మొక్కను గౌరవంగా తొలగించాలి.స్నానం చేసిన తర్వాత మాత్రమే దాన్ని తాకాలి.కుండీ నుంచి తులసి మొక్కను వేరుతో సహా తీసి పవిత్ర నదిలో ముంచాలి.అయితే ఆదివారం లేదా ఏకాదశి రోజు ఈ పని అస్సలు చేయకూడదు.
పాత మొక్క స్థానంలో కొత్త మొక్కను గురువారం రోజు నాటడం మంచిది.మీరు కుండీలోని మట్టిని మారుస్తుంటే ఆ మట్టిని గౌరవంగా ఎక్కడో ఒకచోట ఉంచడం మంచిది.
రామ తులసి ఇంట్లో నాటడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.రామ తులసి మాత్రమే నాటితే బాగుంటుంది.
అలాగే తులసి మొక్కను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి.c అస్సలు నాటకూడదు.
తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది.తులసి ఉన్న చోట దుష్టశక్తులు ప్రవేశించవు.
ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలను నశిస్తాయి.
DEVOTIONAL