ఏప్రిల్ నెల( April ) మొదలు కావడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి.ఏప్రిల్ 2023 గ్రహాలు మరియు రాశుల పరంగా ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు.
ఎందుకంటే ఈ నెలలో కూడా చాలా గ్రహాల రాశి లో మార్పు ఉంటుంది.ఇది మొత్తం 12 రాశుల పై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే ఏప్రిల్ నెలలో కొన్ని రాశుల వారు గ్రహల స్థితి నుంచి శుభ ఫలితాలను పొందుతున్నారు.వారి వృత్తిలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి.
ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి( Aries ) వారు 2023 ఏప్రిల్ నెలలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు.ఈ రాశి వారికి ఏప్రిల్ నెల రెండవ భాగంలో వారి వ్యాపారం, ఫైనాన్స్ మొదలైన విషయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.శని చంద్రుని రాశి నుంచి 11 వ ఇంట్లో ఉండి ఈ స్థానికులను శ్రేయస్సుతో అనుగ్రహించగలడు.
ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి( Gemini ) వారికి ఏప్రిల్ నెల 15వ తేదీ తర్వాత అనుకూల ఫలితాలు ఉంటాయి.ఎందుకంటే ఏప్రిల్ 15 తర్వాత సూర్యుడు మరియు బుధ గ్రహాలు 11వ ఇంట్లో అనుకూల స్థితిలో ఉంటాయి.
శనీ తన సొంత రాశిలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు.ఈ కారణంగా ఈ రాశి వారు ధనాన్ని బాగా సంపాదిస్తారు.ఇంకా చెప్పాలంటే వీరి వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి వృత్తి, ధనం, ఆరోగ్యం మొదలైన విషయాలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.ఏప్రిల్ నెలలో ప్రయాణల ద్వారా డబ్బును కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది.ధనస్సు రాశి వారు వ్యాపారాలలో మంచి లాభాలను చూస్తారు.
ఈ రాశి వారికి ఏప్రిల్ నెల ఆఖరిలో ప్రయాణాలు, ధన అదృష్టం, వృత్తిలో పురోగతి ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారి ఉద్యోగులకు సంబంధించి విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి.