వర్షాకాలం వచ్చింది.దీంతో పాటు సీజనల్ ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి.
ఇక దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.ఎందుకంటే ఈ పండు అందరికీ ఇష్టం.
దీనిలోపలి భాగంలో ఉండే గింజను కూడా తింటారు.ఎందుకంటే దీనిలో పుష్కలమైన ఆరోగ్య ప్రయేజనాలు ఉన్నాయి.
ఎప్పుడు వానాకాలం వచ్చిందంటే చాలు రోడ్డుపై పనస పండ్లను అమ్మడం చూస్తూ ఉంటాం.కొన్నింటిని ఒలిచి కూడా అమ్ముతారు.సాధారణంగా ఇవి సంవత్సరం మొత్తం అందుబాటులో ఉండవు.ఇందులో విటమిన్ ఏ, సీ, బీ6, కాల్షియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఈ పండ్ల సాగుకు ఎలాంటి మందులు వాడరు కాబట్టి ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ పండు చాలా మేలు కలుగుతుంది.
ఇప్పుడు పనస పండ్ల పొడిని కూడా ఉత్పత్తి చేస్తున్నారు.పనస పండును తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఏ ఇతర రోగాలను దరి చేరకుండా కాపాడతాయి.అలాగే, బీపీ నియంత్రణలో ఉండటానికి ఇది చాలా దోహదపడుతుంది.
ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చాలా మంది చేస్తున్నారు.దీంతో వారికి కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉండటానికి ఇది తోడ్పడుతుంది.

పనస తొనాలు తింటే వారి కళ్లకు ఎటువంటి హానీ కలగదు.దీన్ని వైద్యులు కూడా సూచిస్తున్నారు.ఉదర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టేందుకు పనస పని తీరు అద్భుతం.మల బద్ధకం వలంటి సమస్యలు నుంచి బయట పడవచ్చు.అల్సర్ సంబంధిత వ్యాధులు, పుండ్లు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు దీన్ని తినడం వల్ల ఆ సమస్య ఉండదు.ఇక బ్యూటీ పరంగా కూడా దీని పాత్ర అద్భుతం.
ఈ పండును తినడం వల్ల చర్మం నిగారింపు పెరుగుతుంది. మృత కణాలు తొలగిపోతాయి.
ఒబేసిటీతో బాధపడేవారు పనన పండును తినడం వల్ల వారి బరువు పెరగదు.ఎందుకంటే ఇందులో ఏమాత్రం కొవ్వు కూడా ఉండదు.
కాబట్టి కేలరీలకు అవకాశం ఉండదు.ఏజింగ్ సమస్య కూడా ఉండదు.
జుట్టు కూడా బాగా పెరుగుతుంది.అంతేకాదు, పనస తొనలు తినడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరగటానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందట పనస.పనస పండు తినడం వల్ల కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే పోరాడతాయి.ఇందులో పెద్ద పేగు వ్యాధిని కూడా నయాం చేసే గుణం దీనిలో ఉంది.