సైక్లింగ్.అతి ఉత్తమమైన, ఉల్లాసమైన వ్యాయాయల్లో ఇది ఒకటి.
ప్రస్తుత టెక్నాలజీ కాలంలో బైకులు, కార్లు ఇలా రకరకాల వాహనాలు వచ్చేయడంతో సైకిల్ ఎక్కేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు.ఏదో బరువు తగ్గాలనుకునే వారు మాత్రమే సైక్లింగ్ చేస్తుంటారు.
కానీ, సైక్లింగ్ చేయడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాదు.ఎన్నో జబ్బులు కూడా దూరం అవుతాయి.
ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కూడా చేకూరతాయి.ముఖ్యంగా రోజుకో పావు గంట పాటు సైక్లింగ్ చేస్తే మస్తు బెనిఫిట్స్ పొందొచ్చు.
అవేంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వల్ల మెదడు పని తీరు మెరుగు పడుతుంది.
ఆలోచనా శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా రెట్టింపు పెరుగుతుంది.ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి.
కృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్ తొక్కితే మానసిక ప్రశాంత లభిస్తుంది.అలాగే కీళ్ల నొప్పులతో బాధ పడే వారు తరచూ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మానేసి.
రెగ్యులర్‌గా ఓ పావ గంట పాటు సైకిల్ తొక్కడం మంచిదని నిపుణులు అంటున్నారు.

సైకిల్ తొక్కడం వల్ల కండరాలు బలపడతాయి.కీళ్ల నొప్పుల సమస్య దూరం అవుతుంది.గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చునే వారు రోజూ సైక్లింగ్ చేస్తే నడుము నొప్పి, మెడ నొప్పి, నరాలు లాగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
అధిక రక్త పోటును నివారించడంలోనూ సైక్లింగ్ అద్భుతంగా సహాయపడుతుంది.ప్రతి రోజు కాసేపు సైకిల్ తొక్కితే.రక్త పోటు అదుపులోకి వస్తుంది.
అలాగే నిద్ర లేమికి చెక్ పెట్టడంతో సైక్లింగ్ ఉపయోగపడుతుంది.
సైక్లింగ్ చేస్తే.శరీరంలో అలసటకు గరవుతుంది.
దాంతో మంచి నిద్ర పడుతుంది.ఇక ప్రతి రోజు పావు గంట పాటు సైక్లింగ్ చేస్తే.
మధుమేహం, గుండె జబ్బులు, స్థూలకాయం, శ్వాసకోశ జబ్బులు వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.