శరీరంలో సరిపడా రక్తం ఉండకపోవడం వల్ల వచ్చే వ్యాధినే రక్తహీనత అంటారు.చిన్న పిల్లలు, మహిళలు, విష జ్వరాలు సోకిన వారిలో ఈ సమస్య చాలా అధికంగా కనిపిస్తుంది.
దీనిని ఎంత నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు అంత రిస్క్ పెరుగుతుంది.అందుకే వీలైనంత త్వరగా రక్తహీనతను వదిలించుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
మీరు రక్తహీనత బాధితులేనా.? అయితే అస్సలు టెన్షన్ పడకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే చాలా సులభంగా రక్తహీనతను తరిమికొట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గొంజ తొలగించిన ఆరు ఖర్జూరాలు, నాలుగు జీడిపప్పులు, నాలుగు బాదం పప్పులు వేసుకోవాలి.అలాగే అందులో ఒక కప్పు వేడి పాలు పోసి ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై మిక్సీ జార్ తీసుకుని పాలతో సహా ఖర్జూరాలు, బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌ను పోయాలి.
పాలు కాస్త మరిగాక.అప్పుడు గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం మిశ్రమం, చిటికెడు మిరియాల పొడి వేసుకొని రెండు నిమిషాల పాటు హీట్ చేసుకుని.
స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇక చివరిగా ఇందులో కొన్ని పిస్తా పలుకులు యాడ్ చేసుకుంటే రక్తహీనతను తరిమికొట్టే సూపర్ ఫువర్ డ్రింక్ సిద్దమైనట్లే.రోజుకు ఒక గ్లాస్ చప్పున ఈ డ్రింక్‌ను సేవిస్తే రక్తహీనత సమస్య తగ్గడమే కాదు.మళ్లీ మళ్లీ ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటుంది.
పైగా ఈ డ్రింక్ డైట్‌లో ఉంటే నీరసం, అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.