ఈ మధ్య కాలంలో బరువు పెరిగి పోయాం బాబోయ్.అంటూ బాధ పడే వారు భారీగా పెరిగి పోతున్నారు.
కేవలం తినడం వల్లే బరువు పెరుగుతారు అని చాలా మంది భావిస్తుంటారు.ఇలా అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే ఆహారపు అలవాట్ల వల్లే కాదు ఒత్తిడి, మారిన జీవన శైలి, గంటలు తరబడి కూర్చుకోవడం, మద్యపానం, పోషకాల లోపం, థైరాయిడ్, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంటారు.
ఈ గెయిన్ అయిన వెయిట్‌ను తగ్గించు కోకుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టేస్తాయి.
అందుకే బరువు పెరిగిన వారు ఎలా తగ్గాలా అని తెగ సతమతమవుతుంటారు.అయితే కొన్ని కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ బరువును తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
మరి ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంపలు తీసుకుంటే బరువు పెరుగుతారు.
అందుకే అధిక బరువు ఉన్న వారు బంగాళ దుంపలకు దూరంగా ఉంటారు.కానీ, బంగాళదుంపలను ఉడికించి అందులో మిరియాల పొడి కలిపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు.
ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
సాధారణంగా చాలా మందికి పన్నీర్ ఇష్టంగా తింటుంటారు.అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం ఏవైనా కూరగాయలతో కలిపి పన్నీర్ వండుకుని తినాలి.ఇలా చేస్తే ప్రోటీన్, ఫైబర్ రెండూ శరీరానికి పుష్కలంగా అందుతాయి.
దాంతో ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది.చిరు తిళ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు కోట్ల మందికి ఉంటుంది.
అయితే బరువు తగ్గాలని భావించే వారు ఆ కాఫీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవాలి.తద్వారా ఒంట్లో కొవ్వు కరుగుతుంది.
బరువూ తగ్గుతారు.
ఇక గ్రీన్ టీలో నిమ్మ రసం కలిపి తీసుకునే అలవాటు చాలా మందికి ఉండదు.అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం తప్పకుండా గ్రీన్ టీలో లెమన్ జ్యూస్ యాడ్ చేసి తీసుకుంటే.త్వరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.