ప్రతి ఒక్కరు ముఖం కాంతివంతంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు.ప్రస్తుతం ఉన్న బిజీ జీవనశైలిలో ఎవరికీ తీరిక మరియు ఓపిక లేవు.
నిమిషాల్లో పని అయిపోవాలని అనుకుంటారు.అలాంటి వారు చాలా సులభంగా తక్కువ సమయంలో ముఖం మీద ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్, మృత కణాలను తొలగించుకోవడానికి ఒక మంచి చిట్కా ఉంది.
అది ఏమిటంటే మనం ప్రతి రోజు వంటల్లో వాడే ఉప్పు.ఉప్పును ఉపయోగించి ముఖాన్ని అందంగా,కాంతివంతంగా మార్చుకోవచ్చు.
ఈ చిట్కా చాలా సులభం.ఉప్పు చర్మంపై బ్యాక్టీరియాను మరియు ఇన్ ఫెక్షన్స్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.
ఉప్పుతో మొటిమలను కూడా తగ్గుతాయి.అంతేకాక నల్లని ముఖాన్ని తెల్లగా మార్చటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.అయితే ఉప్పును ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఉప్పును ఎలా ఉపయోగిస్తే ముఖం తెల్లగా మారుతుందో చూద్దాం.ఉప్పు చర్మంపై ఉన్న జిడ్డును,మృతకణాలను సమర్ధవంతంగా తొలగిస్తుంది.
మొదట ముఖానికి పచ్చి పాలను రాయాలి.పాలు ముఖానికి రాసాక ఉప్పుతో రుద్దాలి.
ఈ విధంగా చేయటం వలన ముఖం మీద ఉన్న మృత కణాలు,మురికి తొలగిపోతాయి.
ఉప్పును స్క్రబ్ లా ఉపయోగించటం వలన మృత కణాలు సులభంగా తొలగిపోతాయి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం మీద నలుపు పోయి తెల్లగా మారుతుంది.అలాగే మొటిమల సమస్య ఉన్నప్పుడు నిమ్మరసంలో ఉప్పు కలిపి రాస్తూ ఉంటే మొటిమల సమస్య తగ్గుతుంది.