తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఏమోషన్ టచ్ మరీ ఎక్కువైంది.చాలా మంది సినిమా స్టార్స్ ఏదో ఒక చోట కంటతడి పెట్టి జనాలను ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు.
చాలా సార్లు ఉన్నది ఉన్నట్లు చెప్తూ కంట తడి పెడుతున్నారు.తాజాగా ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి.
వాస్తవానికి ఇద్దరు టాప్ హీరోలు కలిసి చేస్తున్న సినిమా అంటే వార్ కి రెడీ అన్నట్లు ఉంటారు వారి వారి అభిమానులు.కానీ రాంచరణ్, ఎన్టీఆర్ ఈగోలకు పోకుండా ఒకరి గురించి మరొకరు పాజిటివ్ గా చెప్పుకుంటూ మంచి రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నారు.
బ్రదర్ బాండింగ్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు.తాజాగా వారు మాట్లాడిన మాటలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.
నాలో సగభాగం చరణ్ అని ఎన్టీఆర్ అంటే.చనిపోయే వరకు తారక్ బ్రదర్ హుడ్ ని మనసులో పెట్టుకుంటా అని చరణ్ అన్నాడు.
వీరి మాటలు చాలా అంటే చాలా పాజిటివ్ థింకింగ్ కలుగజేస్తున్నాయి.
అటు పుష్ప సినిమా విషయంలోనూ ఎమోషనల్ ఘటన జరిగింది.
పుష్ప థ్యాంక్స్ మీట్ లో ఆ టీం అంతా కంటతడి పెట్టడం విశేసం.తన భార్యకు థ్యాంక్స్ చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు సుకుమార్.
అంతేకాదు.చంద్రబోస్ కాళ్లు పట్టుకుని అభినందించాడు.అల్లు అర్జున్ నాకు దేవుడు అంటూ కన్నీరు రాల్చాడు.సుకుమార్ మాట్లాడుతుంటే అల్లు అర్జున్ సైతం బాగా ఎమోషనల్ అయ్యాడు.తను మాట్లాడేటప్పుడు బాగా ఎమోషనల్ అయ్యాడు.సుకుమార్ తో పాటు అక్కడున్న వారివి, జనాలవి గుండెలు బరువెక్కించాడు.
సుకుమార్ లేకుంటే తాను లేనని చెప్పాడు.

అటు శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో నాని మాట్లాడిన మాటలు సైతం రచ్చకు దారి తీశాయి.ఫ్యాన్స్ ను అవమానిస్తున్నారని నాని చేసిన వ్యాఖ్యాలను అర్థం చేసుకోకుండా నెగెటివిటీని ప్రచరం చేసిన వాళ్లు ఎక్కువయ్యారని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడ్డడారు.అటు దిల్ రాజు కూడా నాని మాటల వెనుకున్న అర్థాన్ని వెల్లడించాడు.
నాని ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింతో చెప్పాడు.