దేవాలయాలలో సైతం దేవుడు తెల్లవారుజామున సుప్రభాతం తర్వాత నుంచి రాత్రి పవళింపు సేవ వరకు భక్తులకు దర్శనం చేసుకోవచ్చు.కానీ ఆంధ్రప్రదేశ్లోని( Andhra Pradesh ) ఆ దేవాలయం మాత్రం ప్రత్యేకం అని చెబుతున్నారు.
ఎందుకంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత నర మానవుడు అక్కడ కనిపించడు.దేవుని దర్శనానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని మూసి వేస్తారు.
అసలు ఈ దేవాలయంలో దైవాన్ని సూర్యాస్తమయం( Sunset ) తర్వాత ఎందుకు దర్శించుకోకూడదు.భక్తులు ఎందుకు ఆ సాహసం చేయరు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో సమ్మక్క, సారక్క వనజాతర అందరికీ తెలుసు.అలాగే ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని దట్టమైన అడవి ప్రాంతంలో గుబ్బల మంగమ్మ దేవాలయం( Gubbala Mangamma Temple ) ఉంది.
ఈ దేవాలయంలో అమ్మవారు స్వయంభు అని చెబుతారు.పూర్తిగా గిరిజన గ్రామాల మీదుగా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రాంతాల ప్రజలు ఆలయానికి చేరుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే బుట్టాయ గూడెం ఏజెన్సీలో దట్టమైన అడవి ప్రాంతంలో గుబ్బల మంగమ్మ దేవాలయం ఉంటుంది.

జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట మీదుగా అమ్మవారి దేవాలయానికి భక్తులు చేరుకుంటారు.అయితే దేవాలయం దారిలో కొండవాగులు వర్షాకాలంలో పొంగిపొర్లుతూ ఉండడం వల్ల వర్షలు అధికంగా పడే సమయంలో దేవాలయంలోకి భక్తులను అనుమతించారు.అదే విధంగా స్మార్ట్ ఫోన్ సిగ్నల్స్ ఏ మాత్రం అక్కడ పనిచేయవు.
దీంతో పాటు జనసంచార నీవాసాలకు దూరంగా ఉన్న ప్రాంతం కావడంతో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత భక్తులు ఎవరిని పరిసరాల్లో ఉండనివ్వరు.గుడికి వెళ్లే దారులను సైతం మొదట్లోనే మూసివేస్తారు.

గుబ్బల మంగమ్మ దేవాలయం పూర్తిగా అక్కడ ఉండే గిరిజనుల( Tribal People ) ఆధీనంలోనే ఉంటుంది.అక్కడే స్థానికులు కమిటీగా ఏర్పడి దేవాలయ నిర్వహణ చూసుకుంటున్నారు.అయితే ఇక్కడ పూజారుల విధానం లేదు.ఎవరికి వారు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు.గతంలో గుహ లోపలికి వెళ్లి అమ్మవారి విగ్రహానికి నేరుగా పూజలు చేసేవారు.అయితే ప్రస్తుతం గృహ మొదట్లోనే ఐరన్ గ్రిల్స్ వేయడంతో బయట నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు.