ఉదయం బాలికగా, మధ్యాహ్నం యవ్వన వతిగా, సాయంత్రం వృద్ధురాలిగా దర్శనం ఇచ్చే పద్మాక్షీ దేవి ఆలయం వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఉంది.కోరిన కోర్కెలు తీర్చే ఈ అమ్మవారికి.
ఈ మార్పులు ఆమె చెక్కిళ్లలో కనిపిస్తాయట.ఈ అమ్మవారితో కలిపి కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, హంపి విరూపాక్షి, మధుర మీనాక్షిలను పంచాక్షరీలుగా పిలుస్తూ పంచభూతాలకు ప్రతి రూపాలుగా భావిస్తారట భక్తులు.
ఈ అయిదు ప్రదేశాలు మినహా మరెక్కడా పంచాక్షరీ దేవతలకు సంబంధించిన ఆలయాలు మనకు కనపడవు.
అమ్మవారి ఎడమ చేతి వైపున రెండు క్రోసుల దూరంలో మూడు బండరాళ్లు ఉంటాయి.
సూర్యరశ్మి పడినప్పుడు ఆ రాళ్లు త్రిభుజాకార నీడగా కనిపిస్తాయట.అంతే కాదండోయ్ ఈ ఆలయంలో పద్మాక్షి చెంతనే మహావీరుని విగ్రహం, కుబేరుడి విగ్రహం ఉంటాయి.
ఇక్కడ అనాది నుంచీ నాగిళ్ల వంశస్థులే దేవస్థాన ధర్మకర్తలు, అర్చకులుగా కొనసాగుతున్నారు.పూజా కార్యక్రమాలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
గుట్ట అడుగున పద్మాక్షీ చెరువు ఉంది.చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో పాంచాన్నిక దీక్ష సందర్భంగా శాకంబరీ ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ఈ అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి వరంగల్, కాజీపేట వరకు రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి.అక్కడి నుంచి హన్మకొండ బస్టాండ్‌కు వెళ్తే రెండు కిలో మీటర్ల దూరంలో ఈ పద్మాక్షీ దేవి ఆలయం ఉంటుంది.
ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోలు, ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి.