1.తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరు

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది దీంతో ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల కానున్నారు.
2.కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పందించారు బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలను మోసం చేయడంలో, ప్రజలను పక్కదారి పట్టించడం లో ఇద్దరు దొంగలు అంటూ రేవంత్ విమర్శలు చేశారు.
3.సోనూసూద్ పై కేటీఆర్ వ్యాఖ్య లు

బాలీవుడ్ నటుడు సోనుసూద్ లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు తాజాగా హైదరాబాద్ నగరంలోని హెచ్ ఐ సి సి లో కువైట్ వారి గార్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా, మంత్రి కేటీఆర్ సోనూసూద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కేటీఆర్ సోనూసూద్ ని పొగడ్తలతో ముంచెత్తారు.
4.కెసిఆర్ పై బండి సంజయ్ విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడతారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు.
5.ఏపీ ప్రభుత్వంపై పట్టాభి విమర్శలు

రెండేళ్లలో పెట్రోల్ డీజిల్ పై పన్నుల రూపంలో ప్రజల నుంచి జగన్ ప్రభుత్వం 29 వేల కోట్లు వసూలు చేసిందని టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం విమర్శలు చేశారు.
6.బోర్డు తిప్పేసిన వి ఎస్ వి పి ప్రాజెక్ట్ కంపెనీ
వీఎస్ వీపి ప్రాజెక్ట్ కంపెనీ బోర్డు తిప్పేసింది.కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి ఏరియా లో తక్కువ ధరకే ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ లు ఇప్పిస్తామంటూ 10 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
7.ఈనెల 10న వరంగల్ కు కేసీఆర్

ఈ నెల 10వ తేదీన వరంగల్ లో టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు.
8.ఎయిర్టెల్ కంపెనీ కి నోటీసులు
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హెచరీస్ సంస్థ కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేసింది ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని కోరింది.
9.యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భారీగా బంగారం వితరణ

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారికి మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీగా బంగారం వితరణ వచ్చింది.మేడ్చల్ దాతల సహకారంతో ఏడు కిలోల బంగారాన్ని స్వామి వారి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం 3.50 కోట్ల నగదు, చెక్కులను ఆలయ ఈవో గీతారెడ్డికి మంత్రి మల్లారెడ్డి అందజేశారు.
10.జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ : కోమటిరెడ్డి
తెలంగాణలో జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.
11.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 3837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.కేసీఆర్ పై ఎంపీ అరవింద్ విమర్శలు
టిఆర్ఎస్ అధినేత బారాబర్ జైలుకు పంపిస్తామని ఎప్పటికైనా కేసీఆర్ కచ్చితంగా జైలుకు వెళ్తారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.
13.ప్రజలకు రఘురామ పిలుపు

అమరావతి రైతు మహా పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని దీనికి ప్రజలంతా మద్దతు పలకాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.
14.కుప్పం పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారి పై హైకోర్టులో పిటిషన్
కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారిని మార్చాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
15.లోకేష్ కామెంట్స్

అనంతపురంలో ఎస్ ఎస్ బీఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
16.అద్వానీ తో కేక్ కట్ చేయించిన మోదీ
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ 94 వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో కేక్ కట్ చేయించారు.
17.దమ్ముంటే కేసీఆర్ ఆధారాలు చూపించాలి

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్పై విమర్శలు చేశారు.బీజేపీ పై కేసీఆర్ చేసిన విమర్శలపై స్పందించిన ఆయన కేసీఆర్ ఆరోపణలకు దమ్ముంటే ఆధారాలు చూపించాలని నిలదీశారు.
18.సిపిఐ నారాయణ కామెంట్స్
అమరావతి రైతుల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని, చంద్రబాబు పై కోపం ఉంటే ఆయనను అరెస్టు చేయాలని, అంతేగాని అమరావతి రైతులు పాదయాత్రను వద్దంటు నారాయణ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
19.పవన్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది అని అన్నారు.టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,110 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -49,210