బేబీ ఆయిల్.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పసిపిల్లలకు బేబీ ఆయిల్‌తో మాసాజ్ చేయడం వల్ల.చర్మం మృదువుగా మారడంతో పాటు తేమను రక్షిస్తుంది అలాగే ప్రతిరోజు పసిపిల్లలకు బేబీ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల.
అలసట, చికాకు పోయి హుషారుగా ఉంటారు.అయితే బేబీ ఆయిల్ పిల్లలకే కాదు.
పెద్దలకు కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పొడి చర్మం, మచ్చలతో బాధపడేవారికి బేబీ ఆయిల్ గ్రేట్‌గా సహాయపడుతుంది.అందుకు ముందుగా గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొద్దిగా బేబీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి.కాసేపు మసాజ్ చేసుకోవాలి.
ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ముఖం తేమగా, మృదువుగా మారడంతో పాటు మచ్చలు కూడా మాయం అవుతాయి.

చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతుంటారు.ఇది తగ్గించుకునేందుకు ఎన్నో రకాల క్రీములు వాడతారు.అయితే ఇవి పోగొట్టడంలో బేబీ ఆయిల్ అద్భుతంగ ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు నిద్రించే ముందు బేబీ ఆయిల్‌ను కళ్ల కింద మసాజ్ చేసుకుని పడుకోవాలి.ఇలా చేయడం నల్లటి వలయాలు పూర్తిగా దూరంగా అవుతాయి.
స్ట్రెచ్ మార్క్స్ తొలగించడంలో బేబీ ఆయిల్ సమర్థవంతంగా పనిచేస్తుంది.ప్రతిరోజు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట బేబీ ఆయిత్‌తో మసాజ్ చేస్తే.క్రమంగా అవి మాయం అవుతాయి.అలాగే డ్రైగా మారిన జుట్టుకు కూడా బేబీ ఆయిల్ ఉపయోగపడుతుంది.
అలాంటి వారు జుట్టుకి బేబీ ఆయిల్ ను పట్టించి.అరగంట తరువాత తల స్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.వెంట్రుకలు స్మూత్‌గా మారుతుంది.