దేశం గర్వించేలా పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న యష్టికా ఆచార్య అనే 17 ఏళ్ల అమ్మాయి అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.రాజస్థాన్ లోని బికనీర్‌లో మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన జరిగింది.
బడా గణేష్ జీ టెంపుల్ దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ జిమ్ లో యష్టికా ప్రాక్టీస్ చేస్తోంది.
యష్టికా తన కోచ్ పర్యవేక్షణలో ఏకంగా 270 కేజీల బరువు ఎత్తడానికి ప్రయత్నించింది.
అంత బరువు ఎత్తుతుండగా ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పిపోయింది.అంతే, బరువు ఆమె చేతుల్లోంచి జారి నేరుగా మెడపై పడింది.
ఆ దృశ్యం చూస్తుంటే ఎవరికైనా వణుకు పుట్టడం ఖాయం.ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెంటనే అక్కడున్న వాళ్లంతా పరిగెత్తుకుంటూ వచ్చి బరువును తొలగించారు.సీపీఆర్ కూడా చేశారు కానీ అప్పటికే యష్టికా స్పృహ కోల్పోయింది.వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
చిన్న వయసులోనే యష్టికా పవర్ లిఫ్టింగ్ లో ఎన్నో విజయాలు సాధించింది.అల్వార్ లో జరిగిన 29వ రాజస్థాన్ స్టేట్ సబ్-జూనియర్ అండ్ సీనియర్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ కొట్టింది.
గోవాలో జరిగిన 33వ నల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది.నేష

యష్టికా తండ్రి పేరు ఐశ్వర్య ఆచార్య అలియాస్ ధింగానియా మహారాజ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు.యష్టికాకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.వాళ్లలో ఒకరు కూడా పవర్ లిఫ్టరే.
ఇప్పటి వరకు యష్టికా కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.కానీ పోలీసులు మాత్రం ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.ఏది ఏమైనా హెవీ వెయిట్స్ ఎత్తేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం మంచిది.







