శీతాకాలంలో( Winter ) గాలిలో దుమ్ము, కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి.అయితే దీపావళి తర్వాత కూడా చాలా చోట్ల గాలి నాణ్యత పడిపోతూ ఉంటుంది.
ఎందుకంటే ఎక్కువగా టపాసులు కాల్చడం, వాహనాలు, ఫ్యాక్టరీల నుండి విడుదల అయ్యే పోగల వలన వాయు కాలుష్యంగా( Air Pollution ) మారిపోతుంది.మరి ఇలాంటి వాతావరణాల్లో మనం తిరుగుతున్నందుకు ఆ ప్రభావం మన ఊపిరితిత్తులపై( Lungs ) ఖచ్చితంగా పడుతుంది.
కాబట్టి వాటిని శుభ్రం చేసుకోవడానికి మనం సొంతంగా కొన్ని డీప్ బ్రీతింగ్ ఎక్ససైజ్ చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చెస్ట్ బ్రీతింగ్:
దీని కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా కూర్చోవాలి.ఆ తర్వాత ముక్కు నుండి( Nose ) గాలిని వీలైనంత లోపలికి తీసుకోవాలి.
ఇలా చేసినప్పుడు చాతి భాగం ఎంత వీలైతే అంత విస్తరించాలి.అలా శ్వాసను నిలబెట్టి ఎంత సేపు ఉంచగలిగామో అంత సేపు ఉంచాలి.
ఆ తర్వాత దాన్ని నోటి ద్వారా బయటకు వదిలేయాలి.దీనిలో ఛాతి విస్తరించడం, మళ్ళీ సాధారణ స్థితికి రావడం పై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

నోస్ట్రల్ బ్రీతింగ్:
నిదానంగా కూర్చుని వెన్నుపాము( Backbone ) నిటారుగా ఉండేలా చూసుకోవాలి.ఇక కుడి చేతితో కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు నుండి దీర్ఘంగా శ్వాసను లోపలకు తీసుకోవాలి.ఆ తర్వాత ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు నుంచి గాలిని ( Air ) బయటకు వదిలేయాలి.ఇలా ఒక ముక్కు నుండి శ్వాస తీసుకోవడం మరో ముక్కు నుండి శ్వాస వదలడం చేయాలి.
ఇలా 10 సైకిల్స్ వరకు చేయాలి.

శ్వాసను పట్టి ఉంచడం:
నిదానంగా సుఖాసనంలో కూర్చోవాలి.ముక్కు నుండి దీర్ఘంగా శ్వాసను లోపలికి పీల్చుకొని, ఎంతసేపు వీలైతే అంత సేపు దాన్ని అలాగే పట్టి ఉంచాలి.ఆ తర్వాత మెల్లగా గాలిని బయటకు వదిలేయాలి.
ఇలా చేయడం వలన లంగ్ కెపాసిటీ( Lung Capacity ) పెరుగుతుంది.అలాగే ఆక్సిజన్ కూడా మెరుగుపడుతుంది.
అయితే కాలుష్యంలో తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వలన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి.