ఎన్ని ఆస్తులు ఉంటే ఏం లాభం కడుపుకు నచ్చింది తిననప్పుడు.అందుకే ఉన్నంతలో బాగా తినాలి.
ఆరోగ్యంగా ఉండాలి అంటుంది కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్. ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ ప్రభాస్ హీరోగా తెరెక్కుతున్న సలార్ మూవీలో నటిస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆంధ్రాలో షూటింగ్ లో పాల్గొంటుంది.ఈ సందర్భంగా తెలుగు వారి వంటకాలన్నీ టేస్టీ చేస్తుందట.
అంతేకాదు.ఆంధ్రాలో ఫేమస్ వెజ్, నాన్ వెజ్ వంటలన్నీ తన చెఫ్ తో తయారు చేయించి శ్రుతి బేబికీ తినిపిస్తున్నాడట.
ఫిష్ డిషెస్, నాటుకోడి పులుసు, మటన్ గోంగూర సహా అదిరిపోయే ఆంధ్రా రుచులన్నీ ఆరగిస్తుందట.ఆంధ్రా పప్పును చాలా ఇష్టంగా తింటుందట ఈ ముద్దుగుమ్మ.
ఆంధ్రా ఫుడ్ అనగానే గతంలో ఆమె హైదరాబాద్ బిర్యానీ మాత్రమే అనుకునేదట.కానీ ప్రస్తుతం ఈ వంటల లిస్టు చూసి అమ్మో అంటుందట.అంతేకాదు.ఈ వంటతో తను కొత్త అనుభవం వచ్చిందని చెప్తోంది.
ఇంత టేస్టీ రుచులు ఇంత వరకు తాను ఎప్పుడూ చూడలనే దని చెప్తోంది.మొత్తంగా ఈ మద్రాసు భామకు తెలుగు వంటకాలు బాగా వంటబట్టాయట.
ఈమెకు ఇప్పటి వరకు తమిళనాడు సాంబార్ అంటే చాలా ఇష్టం అట.ప్రస్తుతం ఈ లిస్టులో ఆంధ్రా పప్పుచారు కూడా చేరిందట.ఈ రుచులను చూసిన శ్రుతి హాసన్ కు ఓ బిజినెస్ ఫ్లాన్ కూడా వచ్చిందట.

బాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ కు అడ్డాగా మారిన ముంబైలో సౌత్ ఇండియన్ రెస్టారెంట్ పెట్టాలని భావిస్తున్నట్లు చెప్తోంది.ఆంధ్రా, తమిళ, మళయాల, కన్నడ రుచులన్నీ ఒకే చోట దొరికేలా ఈ రెస్టారెంట్ ను స్థాపించబోతున్నట్లు చెప్పింది.చాలా కాలంగా ముంబైలో రెస్టారెంట ప్లాన్ చేస్తున్నట్లు చెప్పిన ఈ ముద్దుగుమ్మ.
ఆంధ్రా వంటల రుచితే దానికి నిజరూపం ఇవ్వాలని భావిస్తుందట.అంతేకాదు.
తనకు చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది.అందుకే తన అనుభవాన్ని రంగరించి ఈ రెస్టారెంట్ రన్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పింది.