ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధించే కామన్ సమస్యల్లో హెయిర్ ఫాల్ ఒకటి.ఈ సమస్యను నివారించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతుంటారు.వారంలో రెండు, మూడు సార్లు హెయిర్ ప్యాక్స్ వేసుకుంటారు.
అయితే ఇవే కాదు కొన్ని కొన్ని ఆహారాలతోనూ జుట్ట రాలడానికి అడ్డు కట్ట వేయవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్‌ను ఖాళీ కడుపుతో గనుక తీసుకుంటే జుట్టు అస్సలు రాలదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫుడ్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.

అవిసె గింజలు.హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టడంలో అద్భుతంగా సహాయపడతాయి.గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి కలిపి ఖాళీ కడుపుతో సేవించాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే.జుట్టు రాలడం తగ్గడమే కాదు వెయిట్ లాస్ కూడా అవుతారు.
వేపాకు.చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.జుట్టు సంరక్షణలోనూ ఉపయోగపడుతుంది.రోజూ ఉదయాన్నే రెండు నుంచి నాలుగు లేత వేపాకులను తీసుకుని బాగా నమిలి మింగాలి.
ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ నుంచి విముక్తి లభిస్తుంది.శరీరంలో వ్యర్థాలు, విషపదార్థాలు తొలగిపోతాయి.
మరియు ఇమ్యూనిటీ పవర్ సైతం పెరుగుతుంది.

కొబ్బరి నీళ్లు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంలో కొబ్బరి నీళ్లు సూపర్‌గా హెల్ప్ చేస్తాయి.రోజూ పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
కరివేపాకు.దీనిని రోజూవారీ వంటల్లో తీసుకుంటూనే ఉంటాము.కానీ, ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఇంకా మంచిది.ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గుతుంది.
కంటి చూపు మెరుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
మరియు బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి.