ఆషాఢ మాసానికి ఈ పేరేలా వచ్చిందో తెలుసా.?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు 12 నెలలో నాలుగవ నెలను ఆషాడమాసంగా పిలుస్తారు.తెలుగు నెలలో ప్రతి ఒక్క నెలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ క్రమంలోనే ఆషాఢ మాసానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు.ఈ ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు.

అయితే ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆషాఢ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ మాసంలో శుభకార్యాలు జరగకపోవడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఆషాడం అనే పేరు ఆది అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది.

ఆది అంటే సాక్షాత్తు శక్తి అని అర్థం వస్తుంది కనుక ఈ మాసాన్ని ఆషాడ మాసం అని పిలుస్తారు.ఆషాడ మాసంలో ఎక్కువగా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేస్తుంటారు.

Advertisement

ఈ క్రమంలోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.ఆషాడం నెలలో పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవలు వంటి పూజాకార్యక్రమాలు అధికంగా ఉండటం వల్ల పురోహితులు పూజా కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు.

అందుకోసమే ఆషాడ మాసంలో వివాహాలు జరిపించడానికి పురోహితులకు సమయం కుదరకే ఈ నెలలో వివాహాలను రద్దు చేశారు.

ముఖ్యంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆషాడమాసంలో ప్రత్యేకంగా బోనాలను సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి ఎలాంటి కష్టాలు, అనారోగ్య సమస్యలు లేకుండా మనల్ని కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు.అందుకోసమే ఆషాడమాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.ఇక ఆధ్యాత్మిక పరంగా ఆషాడమాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఎంతో మంచి శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు.

ఆషాడ మాసంలో పెట్టుకొనే ఈ గోరింటాకు కార్తీకమాసం నాటికి గోరు చివరకు చేరి చిటికెన వేలు చిగురు నుంచి శివలింగం పై నీరు పడితే ఎంతో పుణ్యఫలం అని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.అదేవిధంగా ఆషాడమాసంలో ప్రతి ఒక్కరూ వారి స్థోమతకు తగ్గట్టుగా దానధర్మాలను చేయటం వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సంతోషాలతో సుఖంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు