అయోధ్య( Ayodhya )లో ఈరోజు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారనే సంగతి తెలిసిందే.ఈరోజు ప్రాణప్రతిష్ట వేడుకను దృష్టిలో ఉంచుకుని యూపీ పోలీసులు భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
అయోధ్యలోని ప్రతి రోడ్డులోనూ భద్రత పెంచామని పోలీసులు చెబుతున్నారు.ప్రముఖులు ప్రయాణించే రోడ్లలో ముళ్ల కంచెలతో ఉన్న బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది.
దేశమంతా రామనామ స్మరణతో మారుమ్రోగుతోంది.ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.పూజారులు ఎన్నో పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన 114 కలశాల పుణ్యజలంతో రాముడి విగ్రహానికి అభిషేకం చేయనున్నారు.
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi )రాముని విగ్రహం కళ్లకు కట్టిన పసుపు వస్త్రాన్ని తొలగించి తొలి దర్శనం చేసుకుంటారు.ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది.

అయితే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట( Ram Mandir Pran Pratishtha )కు హాజరు కావాలని ఉన్నా వేర్వేరు కారణాల వల్ల హాజరు కాలేని వారు ఇంట్లోని శ్రీరాముడిని పూజించడం ద్వారా అయోధ్యకు వెళ్లినంత పుణ్యఫలాన్ని పొందవచ్చు.నిద్రలేచిన వెంటనే తలస్నానం ఆచరించి పసుపు రంగు వస్త్రంలో శ్రీరాముని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.తూర్పు ముఖంగా కూర్చుని పూలతో ధూపం, దీపం వేసి శ్రీరాముడిని, హనుమంతుడిని పూజించడంతో పాటు శ్రీరాముని స్తోత్రాలను జపించాలి.

పూజ సమయంలో అక్షింతలను తలపై వేసుకోవడం వల్ల దేవుని అనుగ్రహం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.మరోవైపు అయోధ్యకు పరిమిత సంఖ్యలో రైళ్లు అందుబాటులో ఉండటంతో మరికొన్ని నెలల పాటు రైలు టికెట్లకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.అయోధ్యకు వెళ్లాలని భావించే వాళ్లు బస్సు, ఇతర మార్గాలలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే మంచిది.
రాముడిని పూజించే ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అయోధ్యకు వెళ్లాలని భావిస్తున్నారు.