రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.ఆ సినిమా లో రామ్ చరణ్ మాస్ పాత్ర లో పల్లెటూరి చెవిటి వ్యక్తి కుర్రాడిగా కనిపించిన విషయం తెలిసిందే.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్న సమయం లో మరి ఇంత మాస్ పాత్ర లను ఇలాంటి కథ ను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అంటూ సినీ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు.కానీ రంగస్థలం సినిమా ఏ స్థాయి సక్సెస్ ని దక్కించుకుందో అందరికీ తెలిసిందే.
వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన రంగస్థలం సినిమా ను మించి మాస్ పాత్ర లు మాస్ కథ తో నాని హీరో గా దసరా అనే సినిమా రాబోతుంది.

వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, పాట ఇలా ఏ ఒక్కటి విడుదలైనా కూడా బాబోయి ఇంత మాస్ ఏంటి అంటూ సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు.నాని చాలా క్లాస్ గా కనిపించే క్లాసీ హీరో అయినా కూడా ఇలా దసరా లో నాని ని చూపించడం ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అర్థం కావడం లేదంటూ కొందరు ఇప్పటి నుండే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కాన్సెప్ట్ మంచి కథ కథనం ఉంటే తప్పకుండా ఆ సినిమా ను సక్సెస్ చేస్తారు అని ఇప్పటికే చాలా సినిమా లు నిరూపించాయి.
కనుక ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటుందని దర్శకుడు నమ్మకం తో ఉన్నట్లుగా తెలుస్తోంది.రంగస్థలం స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి.







