పార్లమెంట్ ఎదుట బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు నిరసనకు దిగారు.ఈడీ, ఐటీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని ఎంపీలు ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
అదానీ సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో లోక్ సభ, రాజ్యసభల్లో నిరసన వ్యక్తం చేస్తామని వెల్లడించారు.
అయితే పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాంపై ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజరైన సంగతి తెలిసిందే.







