సౌత్ లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న హీరోల్లో సూర్య(Surya) ఒక్కరూ తన పని తను చేసుకుంటూ అసలు కాంట్రవర్సీ అనే పదానికి తావు ఇవ్వకుండా ముందు దూసుకుపోతున్న హీరో అనే చెప్పాలి.అయితే సూర్య కి తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది ఇక్కడ కూడా సూర్యకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక ప్రభాస్(Prabhas) గురించి చెప్పాలంటే ప్రస్తుతం ప్రభాస్ ఇంటర్ నేషనల్ హీరో అనే చెప్పాలి బాహుబలి(Bahubali) ప్రపంచ వ్యాప్తం గా చాలా పెద్ద హిట్ అయింది.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే సూర్య, ప్రభాస్ కాంబో లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతుంది.ఇప్పటికే తెలుగు నుంచి ఆర్ ఆర్ ఆర్ లాంటి గొప్ప మల్టీ స్టారర్ సినిమా రావడం మనం చూశాం…ఇప్పుడు దాని ఇన్స్పరేషన్ తోనే ఇండియాలో చాలా మల్టీ స్టారర్ సినిమాలు రాబోతున్నాయి అందులో ప్రభాస్, సూర్య లది ఒకటి.అయితే ఈ సినిమా కి డైరెక్టర్ ఎవరు అంటే సూర్య తో గజిని, సేవంత్ సెన్స్(Ghajini, Seventh Sense) లాంటి సినిమాలు చేసిన మురగదాస్(Muragadas) గారు ఈ సినిమా తీస్తారట.
ప్రస్తుతం మురగదాస్ ప్లాప్ ల్లో ఉన్నారు ఆయన మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది మరి ఇలాంటి పరిస్థితిలో వీళ్ళ కాంబో లో సినిమా వస్తుందా అని, వచ్చిన అది హిట్ అవుతుందా అని మరికొందరు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఒక వేళ ఈ సినిమా కనక వస్తే ఇది చాలా పెద్ద సినిమా గా ఇండియా లోనే చరిత్ర సృష్టిస్తుంది.
అలాగే ఈ సినిమా కొంచం బాగున్న కూడా రికార్డులు అన్ని తిరగ రాస్తుంది అని చెప్తున్నారు…చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టలెక్కుతుందో
.







