ముఖం స్మూత్‌గా, గ్లోయింగ్‌గా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీమ్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వాడతారు.
ఇక ఏదైనా స్పెషల్ డే వస్తుందంటే.వారం రోజుల ముందే నుంచే చర్మంపై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే చాక్లెట్ మాస్క్‌ను ట్రే చేస్తే గనుక.స్పెషల్ డేస్‌లో మీరు మరింత స్పెషల్‌గా మెరిసిపోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చాక్లెట్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక డార్క్ చాక్లెట్‌ను తీసుకుని మక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను గిన్నెలో వేసుకుని డబుల్ బాయిలర్ మెథడ్‌లో మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు అరటి పండు స్లైసెస్, గింజ తొలగించిన ఒక స్ట్రాబెర్రీ, ఒక పుచ్చకాయ స్లైస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌లో మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బ్రెష్ సాయంతో ముఖానికి, మెడకు కావాలి అనుకుంటే చేతులకు కూడా అప్లై చేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై నార్మల్ వాటర్‌తో చర్మాన్ని క్లీన్ చేసుకుని.స్కిన్‌కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.

ఈ చాక్లెట్ మాస్క్‌ను రెండు రోజులకు ఒక సారి వేసుకుంటే.చర్మం స్మూత్‌గా మరియు గ్లోయింగ్‌గా తయారు అవుతుంది.స్కిన్‌పై ఎటువంటి స్పాట్స్ ఉన్నా క్రమంగా తగ్గు ముఖం పడతాయి.డల్ నెస్ పోయి చర్మం యాక్టివ్‌గా, ఎట్రాక్టివ్‌గా మారుతుంది.కాబట్టి, ఈ సింపుల్ చాక్లెట్ మాస్క్‌ను తప్పకుండా ట్రై చేయండి.