సంక్రాంతి( Sankranthi ) అంటే టాలీవుడ్ హీరోలకు చాల స్పషల్.అందరు తమ సినిమా ఆ టైం లో వస్తేనే హిట్ అవుతుంది అని గట్టిగా నమ్ముతారు.
ఆ లిస్ట్ లో విక్టరీ వెంకటేష్( Venkatesh ) ఎల్లప్పుడు ముందు వరసలో ఉంటారు.ఆయనకు సంక్రాంతి హీరో ట్యాగ్ లైన్ కూడా ఉంది.
అయన 35 కెరీర్ లో 13 సార్లు సంక్రాంతి బరిలో నిలిచి విజయాలను దక్కించుకున్నారు.వెంకటేష్ ని ఒక రకంగా హిట్ హీరోగా నిలిపిన చాల సినిమాలు సంక్రాంతి సమయంలోనే విడుదల అయినవి కావడం విశేషం.
ఇక ఈ సారి కూడా సైంధవ్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు వెంకటేష్.
ఇక తన 75 వ సినిమాగా సైంధవ్( Saindhav Movie ) చిత్రం వస్తుండటం విశేషం.1988 నుంచే సంక్రాంతి కి సినిమాలు విడుదల చేయడం మొదలు పెట్టాడు వెంకటేష్.మొట్టమొదటగా రక్త తిలకం అనే సినిమాతో విజయాన్ని అందుకొని ఆ మరుసటి ఏడాది అంటే 1989 లో ప్రేమ చిత్రం సంక్రాంతి కి వచ్చి విజయాన్ని అందుకుంది.1992 లో వచ్చిన చంటి చిత్రం( Chanti Movie ) ఇప్పటికి ఎప్పటికి వెంకటేష్ కెరీర్ బెస్ట్ మూవీ గా ఉండిపోతుంది.
మళ్లి ఒక 8 ఏళ్ళ తర్వాత 2000 సంవత్సరం లో కలిసుందాంరా సినిమా వరకు వెంకటేష్ కి సంక్రాంతి ఒక పీడకల లా మారిపోయింది.ఆ తర్వాత 2001 లో దేవి పుత్రుడు( Devi Puthrudu ) కలెక్షన్స్ పరంగా డల్ అయినా వెంకటేష్ కి మాత్రం మంచి పేరు తీసుకచ్చింది.ఇక 2006 లక్ష్మి సినిమా( Lakshmi Movie ) మళ్లి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది.2013 లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వెంకీ కి మంచి విజయాన్ని ఇచ్చింది.2015 లో గోపాల గోపాల, 2019 లో F2 వెంకటేష్ కి సంక్రాంతి అంటేనే మెమరబుల్ గా మార్చేశాయి.
అయితే సంక్రాంతి కి ఇన్ని విజయాలు దక్కించుకున్న వెంకీ కొన్ని పరాజయాలను కూడా చవిచూడాల్సి వచ్చింది.1995 లో వచ్చిన పోకిరి రాజా,( Pokiri Raja ) 1996 లో వచ్చిన ధర్మచక్రం, 1997 లో వచ్చిన చిన్నబ్బాయి వరసగా పరాజయాలను తెచ్చి పెట్టాయి.2010 లో నమో కటేశాయ పర్వాలేదు అనిపించుకుంది.2012 లో బాడీ గార్డ్ కూడా ప్లాప్ సినిమాగా నిలిచి వెంకటేష్ ని నిరాశ పరిచాయి.ఈ సినిమాల లాగా కాకుండా హిట్ సినిమాల పక్కన సైంధవ్ సినిమా కూడా నిలుస్తుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.