సోషల్ మీడియా మాయలో జనాలు వెర్రి పనులు చేస్తున్నారు.మరీ ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా (Social media)మత్తులో పడి ఏం చేస్తున్నారో వారికే అర్ధం కావడంలేదు.
అందులోనూ ప్రాంక్ వీడియోస్ పేరు జెప్పి అనుచితంగా ప్రవర్తించే కేటుగాళ్లు ఎందరో ఉన్నారు.ప్రాంక్ అని చెబుతూ ఎదుటివారు ఫీలయ్యే విధంగా ప్రవర్తిస్తూ వారి గౌరవానికి భంగం కలుగజేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బర్త్ డే పార్టీలో వెరైటీ రీల్స్ చేసిన ఓ యువకుడు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న వైనాన్ని మనం చూడవచ్చు.
సదరు వీడియోని గమనిస్తే… సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి… ఓ యువతి బర్త్ డే ప్లాన్(Young girl’s birthday plan) చేశాడు.
ఈ క్రమంలో తన పైశాచిక వీడియోకి మంచి కంటెంట్ దొరికేలా ప్లాన్ చేసాడు.ఈ క్రమంలో కేక్, జనాలు హంగామా అంతా ఆబగా సెటప్ చేసాడు.ఇక సమయం కావడంతో క్యాండిల్ వెలిగించాడు.అది వెలుగుతుండగా అందరు కేకలు వేస్తూ… చప్పట్లు కొడుతూ సో కాల్డ్ బర్తడే బేబీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఆ క్యాండిల్ చివరగా ఆగిపోతుందనగా కేక్ ఫట్ మని పేలిపోయింది.దీంతో అక్కడ జనాలంతా ఒకరి తరువాత ఒకరు ఒకటే పరుగు.
వారి పరుగులు చూసి ఇక్కడ ఆ సెటప్ ఏర్పాటు చేసినవారు చిందులు తొక్కడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు.సదరు వీడియోని అక్కడ శునకానందం పొందిన వ్యక్తి ప్రాంక్ వీడియో అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.
ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
ఇక దానిని చూసిన నెటిజన్లు మాత్రం.ఇవేం ప్రాంకులు రా బాబు! అని కొందరు కామెంట్ చేస్తే… మరికొందరు… ఇలాంటివారిని ఊరికే వదలకూడదు… ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అని కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరు అయితే ఇలాంటి ప్రాంక్స్ చేసేవారిని బొక్కలో వెయ్యాలని, కాంజ్యుమర్ కోర్టులో కేసు వేసి జరిమానా విధించాలని కోరుతున్నారు.
కాగా వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు, కేక్‌ను అబ్దుల్ ఫ్యాక్టరీ నుండి ఆర్డర్ చేసినట్లు కనిపిస్తోంది.ఇప్పటికే చాలా మంది ఆ వీడియోను తిలకించగా… మరింతమంది దానిని చూస్తూ వైరల్ చేస్తున్నారు.
అయితే ఎక్కువమంది ఆ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు.