ఈ కాలంలో ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.స్లిమ్ అవ్వడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు.
కొందరు అయితే ఏమి తినకుండా కడుపు మార్చుకుని మరి డైటింగ్ చేస్తూ ఉంటారు.మరికొందరు అయితే బరువు తగ్గడానికి రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు.
కానీ ఫలితం మాత్రం ఆశించినంత కనపడడం లేదని చింతించే వారికోసం ఈ టిక్ టాక్ వెయిట్ లాస్ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది అనే చెప్పాలి.తాజాగా టిక్ టాక్‌లో 12-3-30 వర్కవుట్ ఫార్ములాకు సంబందించిన వీడియోను లారెన్ గిరాల్డ్ అనే యూజర్ టిక్‌టాక్ లో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.
అసలు వెయిట్ లాస్ అయ్యే ఫార్ములా ఏంటి.? ఇది ఎలా వర్క్ అయింది అనే వివరాలు చూద్దాం.
ముందుగా ట్రెడ్ మిల్ పై ఇంక్లైన్ లెవల్ అనేది 12 ఉంచి దాని వేగం గంటకు 3మైళ్లు సెట్ చేసి పెట్టుకుని ఒక 30 నిమిషాలు పాటు ఒకేసారి ఆపకుండా దాని మీద నడవాలి.ఇలా చేయడం ద్వారా 12 నుంచి 13 కేజీల బరువు తగ్గవచ్చని వీడియోలో గిరాల్డ్ తెలిపారు.
అంతేకాకుండా ఈ వ్యాయామం ఏమి కష్టంగా ఉండదని చాలా సింపుల్ గా చేయవచ్చని గిరాల్డ్ అంటున్నారు.ట్రెడ్ మిల్ పై వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడడంతోపాటూ, ప్రతి రోజూ ఇలా నడవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుందట.

ఈ 12-3-30 వర్కవుట్ ప్లాన్ అనేది మొదటలో నిదానంగా ప్రారంభించి తరువాత కఠినంగా పెంచుకుండా పోవడం వలన బరువు వేగంగా తగ్గుతారు.పరుగెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయలేని వారికి కూడా టిక్ టాక్ 12-3-3 ఫార్ములా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు.అలాగే ఈ వ్యాయామాలతో పాటు ఆహార సమతుల్యత కూడా పాటించాలి.ఇలా ప్రతి రోజూ 30 నుంచి 45 నిమిషాలపాటు వ్యాయామం చేస్తూ, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే బరువు సులభంగా తగ్గుతారు అని నిపుణులు అంటున్నారు.