ఇండస్ట్రీ అన్న తర్వాత ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు గుర్తుండి పోతూ ఉంటాయి.
మరీ ముఖ్యంగా కొన్ని సినిమాలో జంటగా నటించిన హీరో హీరోయిన్లు ప్రేక్షకులకు ఫేవరేట్ జోడి గా మారిపోతూ ఉంటారూ.సాధారణంగా హీరో హీరోయిన్లు కలిసి ఏకంగా మూడు నుంచి నాలుగు సినిమాలు చేయడం ఆ సినిమాలు హిట్ అయినప్పుడే ప్రేక్షకులు ఆ జంటకు ఆకర్షితులవుతారు.
కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతోమంది హీరో హీరోయిన్లు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంటూ ఉన్నారు.మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయితే బాగుండు అని ప్రేక్షకుల మదిలో ఒక ఆలోచన వచ్చే విధంగా చేస్తున్నారు.
మరి ఇటీవల కాలంలో అలా ప్రేక్షకుల మదిని దోచిన జంటలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకర్షించిన జంట గురించి చెప్పుకోవాలంటే ముందుగా కృతి శెట్టి- వైష్ణవ్ తేజ్ గురించి చెప్పాలి.
బుజ్జి బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పై అటు ఉప్పెన సినిమా వచ్చింది.ఇక ఇద్దరికీ మొదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అంతేకాదు వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి హిట్ పెయిర్‌గా గుర్తింపు అందుకుంది.
ఇక నాగచైతన్య సాయి పల్లవి జంట కూడా వార్తల్లో నిలిచింది అని చెప్పాలి.
వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరి.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా ఉందని ప్రేక్షకులు అనుకున్నారు.దీంతో ఇక ఈ జోడి అటు ప్రేక్షకులకు ఫేవరెట్ జోడి గా మారిపోయింది.
శ్రీ విష్ణు- సునైనా కలిసి నటించిన చిత్రం రాజరాజ చోర.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.ఇందులో సునైన శ్రీ విష్ణు భార్యాభర్తలుగా నటించారు.ప్రేక్షకులను ఆకర్షించారు.
ఆ తర్వాత వచ్చిన చిత్రం పెళ్లి సందD.శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా ఈ సినిమాతో పరిచయం అయ్యారు.ఇక గౌరీ రోణంకి తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.శ్రీలీల రోషన్ మధ్య కెమిస్ట్రీ అందరికీ నచ్చేసింది.ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మొదటి సారి కలిసి నటించారు.కానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను ఫిదా చేసింది అని చెప్పాలి.
ఇక నాగశౌర్య రీతు వర్మ వరుడు కావలెను.కిరణ్ అబ్బవరం ప్రియాంక జవాల్కర్ ఎస్ ఆర్ కళ్యాణమండపం.
సుధీర్‌బాబు ఆనంది శ్రీదేవి సోడా సెంటర్.శర్వానంద్ అతిథి రావు హైదరి మహాసముద్రం లో జంటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి.
ఇక ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యమీనన్ బాగా సెట్ అయింది అని ప్రశంసలు కూడా అందుకున్నారు.