అసిడిటీ( acidity).అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ సమస్యల్లో ఇది ఒకటి.
ఏదైనా ఆహారం తీసుకోగానే ఛాతిలో మంట, తీవ్రమైన అసౌకర్యం, పుల్లని త్రేన్పులు వంటి ఎసిడిటీ లక్షణాలను దాదాపు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఉంటారు.అయితే కొందరు అసిడిటీ సమస్యతో ప్రతినిత్యం బాధపడుతుంటారు.
ఇలాంటి వారు ఏమైనా ఆహారం తినాలంటేనే భయపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న మార్పులతో అసిడిటీకి మీరు ఆమడ దూరంలో ఉండవచ్చు.

నిజానికి అసిడిటీ వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.తరచూ అసిడిటీ సమస్యతో బాధపడేవారు అతిగా తినే అలవాటు ఉంటే మానుకోవాలి.భోజనాన్ని కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గా తీసుకోవాలి.
వేళకు తినకపోవడం కూడా అసిడిటీకి ఒక కారణం.అందుకే టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవాలి.
టీ, కాఫీలు,( Tea, coffee ) ధూమపానం మద్యపానం మానుకోవాలి.తిన్న వెంటనే కొందరు పడుకుంటూ ఉంటారు.
కానీ అలా కాకుండా కాసేపు వాకింగ్ చేయండి.నైట్ 7 గంటల్లోపు డిన్నర్ ను ముగించండి.

వేపుళ్ళు, పులయ బెట్టిన పదార్థాలు, ఘాటైన కారం తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండండి.వెల్లుల్లి, నూనె, ఉప్పు తీసుకోవడం తగ్గించండి.ఇక ఈ మార్పులతో పాటు రోజు ఉదయం ఒక క్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ( Cumin )వేసి మరిగించి ఆ నీటిని తీసుకోండి.జీరా వాటర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.అలాగే భోజనం తర్వాత అర స్పూన్ సోంపు తిని గోరువెచ్చని నీటిని తీసుకోండి.
ఇలా చేస్తే అసిడిటీ మీ వంక కూడా చూడదు.నైట్ నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి కలిపి తీసుకోండి.
ఇది కూడా మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తకుండా రక్షిస్తుంది.