శరీరం నుండి వాసన రాకుండా రోజుకి రెండుసార్లు స్నానం చేస్తాం కాని, నోటి దుర్వాసన సమస్య ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఏం చేయాలో అర్థం కాదు.
ఎన్నిసార్లని వక్కపొడి నములుతాం.మరి దీనికి పరిష్కారమే లేదా అంటే ఉంది … కాని క్రమం తప్పకుండా చెప్పే చిట్కాలను పాటించాలి.
* రోజుకి కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు తాగాలి.ఎందుకంటే ఎండిపోయిన నోరులోనే బ్యాక్టీరియా చేరి, దుర్వాసనకు కారణం అవుతుంది.
* కేవలం దంతాలను మాత్రమే కాదు, నాలుకను కూడా రోజు శుభ్రం చేసుకోవాలి.
* సిగరెట్ తాగే అలవాటు లేకుంటేనే మంచిది.
ఒకవేళ ఉన్నా, వెంటనే మానెయ్యండి.
* సుగర్ లేని చూయింగ్ నమలాలి.
దానివలన నోటిలో సలైవా ఫ్లో పెరుగుతుంది.
* కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి.
* భోజనం తరువాత బ్రష్ చేసుకోవాలి.
* మాంసాగారం, డైరి ఫుడ్ తగ్గించాలి.
* ప్రతి ఆరు నెలలకోసారి డాక్టర్ ని సంప్రదించి డెంటల్ టెస్ట్ చేయించుకోవాలి.