మన ఫోన్ మనం మాత్రమే వాడాలి.మిగితా ఎవరు ఫోన్ ని తాకినా మనకు ఎక్కడలేని కోపం వస్తుంది.
ఫోన్ లో రహస్యాలు ఉన్నా లేకున్నా, మన ఫోన్ ని వేరే ఎవరో అయిదు నిమిషాలు దగ్గర పెట్టుకున్నా, అదేదో విచిత్రమైన ఫీల్.వెంటనే లాక్కోవాలి అనిపిస్తుంది.
నీ ఫోన్ ఉందిగా, నా మొబైల్ తో ఏం పని అని గట్టిగా తిట్టాలనిపిస్తుంది.ఏంటో అలా అలవాటు పడిపోయాం.
మన మొబైల్ ని ఎవరైనా ముడితే, సొంత గర్ల్ ఫ్రెండ్ ని లేదా బాయ్ ఫ్రెండ్ ని తాకినట్లు ఫీల్ అయిపోతున్నాం.
మీ స్నేహితుల మొబైల్ ముట్టుకున్నా ఫర్వాలేదు, నచ్చకపోతే ముఖం మీదే తిడతారు.
కాని మీ లవర్ మొబైల్ ని మాత్రం ముట్టొద్దు.మరీ ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ మొబైల్ ని అయితే అస్సలు ముట్టోద్దు.
మీరు సొంత మనిషే, కాని ఇది హుమన్ సైకాలజి.
అమెరికాలో ఇటివలే ఓ సర్వేలో భాగస్వామి మీ మొబైల్ ని పట్టుకోని చూస్తే కోపం వస్తుందా రాదా అనే ప్రశ్న ఇటు అబ్బాయిలకి, అటు అమ్మాయిలకి వేసారు.85% అమ్మాయిలు కోపం వస్తుందని చెప్పారు.ఇక అబ్బాయిల్లో 63% శాతం మంది కోపం వస్తుందని చెప్పారు.
నచ్చదు అని చెప్పినవారందరి కారణం ఒకటే, ఫోన్ తీసుకోని చూస్తే, అనుమానించినట్లు అనిపిస్తుందట.అందుకే జాగ్రత్తగా మెదలండి.







