నెలసరి లేదా పీరియడ్స్. ఆడవారిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది.
ఎంత వద్దనుకున్నా ప్రతి నెల పలకరించే పీరియడ్స్ కారణంగా అనేక భయాలను, బాధలను ఆడవారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెనోపాజ్ వచ్చేవరకు పీరియడ్స్ ప్రతినెలా వస్తూనే ఉంటాయి.
ఇక పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తే.వారు ఆరోగ్యంగా ఉన్నట్టే అని నిపుణులు అంటారు.
అయితే ఒక్కో సారి కొందరు మహిళలు నెలసరి ఆలస్యం కావాలని కోరుకుంటారు.ముఖ్యంగా ఏవైనా పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లేదా ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు నెలసరిని లేట్ చేయాలని భావిస్తారు.
ఈ క్రమంలోనే పలు మందులు కూడా వేసుకుంటారు.కానీ, ఎలాంటి మందులు లేకుండా న్యాచురల్‌గా కూడా నెలసరిని ఆలస్యం చేయవచ్చు.మరి ఆ న్యాచురల్ పద్ధతులు ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.నెలసరిని ఆలస్యం చేయడంలో ఆవాలు అద్భుతంగా సహాయపడతాయి.
ప్రతి రోజు వంటల్లో విరి విరిగా ఉపయోగించే ఆవాల్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.అటువంటి ఆవాలను ఒక స్పూన్ తీసుకుని.
రాత్రి నిద్రించే ముందు ఒక కప్పు పాలలో నానబెట్టాలి.వీటిని మరుసటి రోజు ఉదయం తినాలి.
నెలసరి రావడానికి వారం రోజుల ముందు నుంచి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక యాలకులు కూడా నెలసరిని ఆలస్యం చేయగలవు.పీరియడ్స్ రావడానికి నాలుగు రోజుల ముందు నుంచి రెండు యాలకులను ట్యాబ్లెట్‌లాగా వేసేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల కూడా నెలసరి ఆలస్యం అవుతుంది.
ఇక రాత్రి నిద్రించే ముందు పాలలో ఒక స్పూన్ సబ్జా గింజలను నానబెట్టి.ఉదయాన్నే దానిని తీసుకోవాలి.
ఇలా చేయడం వల్లా మంచి ఫలితం ఉంటుంది.
యాపిల్ సిడర్ వెనిగర్‌తో కూడా పీరియడ్స్‌ను ఆలస్యం చేయవచ్చు.
అయితే నెలసరి రావానికి పది రోజుల ముందు నుంచే ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్‌ను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా నెలసరి లేట్‌గా వస్తుంది.
ఇక నిమ్మ కాయ గింజలు కూడా పీరియడ్స్‌ను ఆలస్యం చేయగలవు.నెలసరి వచ్చే నాలుగు రోజుల ముందు నుంచి ఐదారు నిమ్మ గింజలను నిమిలి మింగేయాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.