సల్మాన్ రష్మిక మధ్య 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్.. ఈ కామెంట్లపై అమీషా రియాక్షన్ ఇదే!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) ఇటీవల సికందర్( Sikandar ) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Ameesha Patel Salman Khan Rashmika Age Gap Sikandar Movie Details, Ameesha Patel-TeluguStop.com

ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూ దూసుకుపోతోంది.కానీ ఊహించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది.

ఈ మూవీ రిలీజ్‌ కు ముందు సల్లు భాయ్‌ ప్రమోషన్స్‌ లో బిజీగా పాల్గొన్నారు.అదే సమయంలో రష్మిక తో సల్మాన్‌ ఏజ్ ‍గ్యాప్‌ పై పలువురు ప్రశ్నించారు.

మీ కూతురి వయసు ఉన్న అమ్మాయితో ఎలా నటిస్తారంటూ నెట్టింట విమర్శలు వచ్చాయి.

Telugu Age Gap, Ameesha Patel, Ameeshapatel, Bollywood, Gadar, Rashmika, Rashmik

దీనిపై సల్మాన్ సైతం స్పందించారు.ఆమెకు లేని ఇబ్బంది.మీకు ఎందుకని ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ లో మాట్లాడారు.

భవిష్యత్తులో రష్మికకు పాప పుడితే ఆమెతో కూడా నటిస్తానని సల్మాన్ ఖాన్ అన్నారు.అయితే తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్( Ameesha Patel ) కూడా స్పందించారు.

సినిమాల్లో నటీనటుల మధ్య ఏజ్‌ గ్యాప్‌ ‍అనేది సాధారణ విషయం అని అన్నారు.ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అమీషా పటేల్ మాట్లాడారు.

అలాగే తనకు కూడా గదర్‌ చిత్రంలో సన్నీ డియోల్‌ కు, ( Sunny Deol ) నాకు దాదాపు 20 ఏళ్ల అంతరం ఉందని ఆమె గుర్తు చేశారు.

Telugu Age Gap, Ameesha Patel, Ameeshapatel, Bollywood, Gadar, Rashmika, Rashmik

ఈ సందర్బంగా అమీషా మాట్లాడుతూ.గదర్‌ 2( Gadar 2 ) సినిమాలో నాకు సన్నీ డియోల్‌ కు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.

అందుకే మూవీ సూపర్‌ హిట్‌ గా నిలిచింది.అలాగే సల్మాన్, రష్మిక జోడిని అభిమానులు ఇష్టపడుతున్నారు.

నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో కలిసి పనిచేశానని తెలిపింది.ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube